సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘SSMB29’ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ సినిమా గురించి వచ్చిన ప్రతి అప్డేట్కి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఈ గ్లోబల్ అడ్వెంచర్ డ్రామాలో మహేష్ బాబుకి జోడీగా ప్రియాంక చోప్రా నటించనుండగా, విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంపిక అయ్యారు. మొదటి షెడ్యూల్లో మహేష్‌తో కలిసి పృథ్వీరాజ్ కూడా షూటింగ్లో పాల్గొన్నట్టు సమాచారం.
తాజాగా ఈ కమెర్షియల్ వెంచర్లో మరొక క్రేజీ ఆర్టిస్ట్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సౌత్-నార్త్ ఇండస్ట్రీల్లో భారీ ఇమేజ్ ఉన్న ఆర్ మాధవన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్టు తాజా సమాచారం. కథ విని ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. త్వరలోనే ఆయన షూటింగ్లో జాయిన్ కానున్నారని టాక్.
ఈ భారీ ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేస్తున్నారు. ఇందులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మలయాళ స్టార్ పృథ్వీరాజ్, మరోవైపు తమిళ స్టార్ మాధవన్, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా లాంటి భారీ తారాగణం ఇన్వాల్ కావడం సినిమాకు అదనపు హైప్ తీసుకువచ్చింది.
రాజమౌళి మార్క్‌లో రూపొందుతోన్న ఈ అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అన్ని వర్గాల అంచనాలు రీచ్ అయ్యేలా ప్రత్యేక శ్రద్ద తీసుకొని రాజమౌళి ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు.






