Mana Enadu : కేరళ కాసర్గోడ్ జిల్లా నీలేశ్వరం సమీపంలోని అంజోతంబలం వీరర్కవు ఆలయం(Kerala Temple)లో గత రెండు రోజులుగా వార్షిక కాళియాట్లం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం అర్ధరాత్రి నిర్వహించిన తెయ్యం ఉత్సవంలో భక్తులంతా మునిగిపోయారు. కొందరేమో కళాకారుల ప్రదర్శనలను ఉత్సాహంగా తిలకిస్తూ ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్లలో రికార్డు చేస్తున్నారు.
అకస్మాత్తుగా పేలుడు
ఈ క్రమంలో అకస్మాత్తుగా పేలుడు (Kerala Temple Blast) శబ్ధం వినిపించించడంతో అక్కడి భక్తులంతా ఉలిక్కిపడ్డారు. పేలుడు శబ్ధాలకు భయపడి పరుగులు పెట్టడంతో ఆ ప్రాంతంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 150 మందికిపైగా గాయపడ్డారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను కాసరగోడ్, కన్నూర్, మంగళూరులోని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
బాణాసంచా పేలడం వల్లే మంటలు
during the Nileshwaram Veerarkavu Kaliyattam in Kasaragod, an explosion at a fireworks storage site left 154 people injured, with 8 in critical condition. District Collector Imbashekhar reported that 97 of the injured are undergoing treatment.#explosion #Kerala #fireworks pic.twitter.com/EkxeerWihr
— Sreelakshmi Soman (@Sree_soman) October 29, 2024
అయితే తెయ్యం ఉత్సవంలో భాగంగా బాణసంచా కాల్చడం(Kerala Temple Fire Update)తో నిప్పు రవ్వలు ఎగిసి ఆలయం సమీపంలోని బాణసంచా నిల్వ ఉంచిన షెడ్డుపై పడ్డాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి బాంబు పేలినట్లుగా పెద్ద శబ్ధాలతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ భయానక దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిబంధనల ఉల్లంఘనల వల్లే
భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని జిల్లా కలెక్టర్ ఇంబా శేఖర్ వెల్లడించారు. బాణసంచా (Kerala Fireworks Blast) నిల్వ ఉన్న ప్రాంతానికి కనీసం 100 మీటర్ల దూరంలో క్రాకర్లు కాల్చాలనే నిబంధనలు పాటించలేదని తెలిపారు. టపాసుల నిల్వకు సైతం అనుమతి తీసుకోలేదని చెప్పారు. ఘటనా స్థలంలో నమూనాలు సేకరించి కేసు నమోదు చేశామని, ఆలయ అధ్యక్ష, కార్యదర్శిని అదుపులోని తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వివరించారు.






