గతేడాది కోలీవుడ్ లో రిలీజ్ అయి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది ‘కంగువా (Kanguva)’ చిత్రం. సూర్య (Suriya) హీరోగా.. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ప్రేక్షకులను మెప్పించడంలో తీవ్రంగా విఫలమైంది. ఫలితంగా సూర్య తన కెరీర్ లోనే భారీ డిజాస్టర్ ను మూటగట్టుకోవాల్సి వచ్చింది. పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయిన కంగువా.. విడుదలైన ప్రతి భాషలో ఫ్లాప్ గానే మిగిలింది. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్ గా నటించింది.
ఆస్కార్ రేసులో డిజాస్టర్ మూవీ
కానీ ఇప్పుడు కంగువా సినిమా భారతదేశం గర్వించే దిశగా దూసుకెళ్తోంది. కలెక్షన్లు, టాక్ పరంగా డిజాస్టర్ గా పేరు తెచ్చుకున్న కంగువా సినిమా ఇప్పుడు ఆస్కార్ రేసు (Oscar Race 2025)లో నిలిచింది. 2025 వ ఆస్కార్ అవార్డుల కోసం ప్రపంచ వ్యాప్తంగా 323 సినిమాలు పోటీ పడగా వాటిలో 207 సినిమాలు నామినేషన్స్‌లో నిలిచాయి. అందులో భారతదేశానికి చెందిన మూడు సినిమాలున్నాయి. ఆ లిస్టులో కంగువా మూవీ ఉత్తమ చిత్రం (Kanguva in Oscar Best Movie Category) విభాగంలో పోటీ పడుతోంది.
BREAKING: Kanguva ENTERS oscars 2025🏆 pic.twitter.com/VoclfVtLBL
— Manobala Vijayabalan (@ManobalaV) January 7, 2025
ఇండియా నుంచి ఆ మూడు చిత్రాలు
ఇండియా నుంచి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో మలయాళ సూపర్ హిట్ సినిమా ‘ఆడు జీవితం (Aadujeevitham)’, తమిళ సినిమా ‘కంగువా’ తో పాటు ‘సంతోష్ స్వతంత్ర వీర్ సావర్కర్ (Santosh Swatantrya Veer Savarkar)’ కూడా ఈ లిస్ట్ లో చోటు సంపాదించాయి. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నిర్మాతగా కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’ కూడా ఆస్కార్ 2025 రేసులో నిలిచిన విషయం తెలిసిందే. కానీ షార్ట్ లిస్ట్ లో స్థానం సంపాదించ లేక వెనుతిరిగింది.






