ManaEnadu : కోలీవుడ్ హీరో సూర్య (Suriya)కు ‘ఆకాశమే హద్దు’, ‘జై భీమ్’ తర్వాత సరైన హిట్ ఒక్కటీ లేదు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ‘కంగువా (Kanguva)’ సినిమా డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. ఒక్క గట్టి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు సూర్య. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు లైనప్ లో ఉంచాడు. అందులో ఒకటి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రానుంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ లో కనిపించనుంది. సూర్య44 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది.
ఫ్యాన్స్ కు సూర్య క్రిస్మస్ ట్రీట్
సూర్య తన అభిమానులకు క్రిస్మస్ కానుక ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తున్న సినిమా టైటిల్ (Suriya 44 Update) ను క్రిస్మస్ రోజు (డిసెంబరు 25వతేదీ)న ప్రకటించనున్నారు. బుధవారం రోజున ఈ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు లాంచ్ చేయనున్నట్టు ప్రకటిస్తూ ఓ లుక్ షేర్ చేశారు.
The One’s Xmass Gift 🎁
Get ready for the #Suriya44 Title Teaser 🔥 Tomorrow, 25th Dec at 11 AM #LoveLaughterWar #TheOneXmass @Suriya_Offl @karthiksubbaraj @hegdepooja @Music_Santhosh @rajsekarpandian @kaarthekeyens @kshreyaas @cheps911 @jacki_art #MayaPandi @JaikaStunts… pic.twitter.com/oExsViuC69
— 2D Entertainment (@2D_ENTPVTLTD) December 24, 2024
సూర్య 44 టైటిల్ టీజర్
ఈ పోస్టర్ లో సముద్రతీరాన ఓ బెంచ్‌పై పూజా హెగ్డే (Pooja Hegde) కూర్చొని ఉండగా.. పక్కనే సముద్రంలోకి గులకరాళ్లు విసురుతూ సూర్య కనిపించాడు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్నారు. సూర్య హోం బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక ఈ మూవీలో మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీరియాడిక్ వార్ అండ్ లవ్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం.
స్పెషల్ సాంగ్ లో శ్రియా శరణ్
ఇక ఈ సినిమాలో శ్రియా శరణ్ (Shriya Saran) స్పెషల్ సాంగ్ ఉండనుందని మేకర్స్ తెలిపారు. గోవాలో ఈ పాట కోసం స్పెషల్ సెట్ వేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ లవ్ స్టోరీని వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఇదే కాకుండా సూర్య లిస్టులో మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. లోకేశ్ కనగరాజ్ తో రోలెక్స్ మూవీ, సుధా కొంగరతో మరో చిత్రానికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.






