Mana Enadu : మాజీ ప్రధాని, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అనారోగ్య కారణాలతో గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. పార్థివదేహాన్ని దిల్లీలోని ఆయన నివాసంలో ఉంచగా ప్రముఖులు సందర్శిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ (PM Modi) సహా కీలక నేతలు ఆయనకు అంజలి ఘటించారు. తాజాగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు వేర్వేరుగా ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు.
ముఖ్యమంత్రుల ఘన నివాళి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (AP CM Revanth Reddy)తో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, తెలంగాణ ఎంపీలు నెహ్రూమార్గ్ లోని మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu), కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు శబరి, కేశినేని చిన్ని మన్మోహన్ పార్థివదేహానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.
Delhi | Andhra Pradesh CM N Chandrababu Naidu pays final respect to former Prime Minister Dr Manmohan Singh and offers condolences to his family
(Source: TDP) pic.twitter.com/FneSF28mNd
— ANI (@ANI) December 27, 2024
ఆయన మరణం తీరని లోటు
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ మరణంతో దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని అన్నారు. ఆయన ఆశయాలను మనమంతా ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని.. ఆయన మృతి దేశానికి తీరని లోటన్నారు. మన్మోహన్సింగ్ మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. దేశాన్ని ఆర్థికంగా మన్మోహన్ కొత్త పుంతలు తొక్కించారని.. ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమైనవని కొనియాడారు.
#WATCH | Andhra Pradesh CM N Chandrababu Naidu reaches Delhi Airport as he departs for Vijayawada.
He paid final respect to former Prime Minister Dr Manmohan Singh and offered condolences to his family, in Delhi today pic.twitter.com/g3oa52gGR9
— ANI (@ANI) December 27, 2024







