Prabuthwa Junior Kalashala |రాయలసీమ యాస నేర్పించాం.. పేరెంట్స్ ను గుర్తుతెచ్చుకునే సినిమా –

Mana Enadu: ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటిస్తున్న సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఈ చిత్రాన్ని ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్ పై కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. సెన్సార్ నుంచి యూ.ఏ సర్టిఫికేట్ అందుకున్న ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

దర్శకుడు శ్రీనాథ్ పులకురం(Srinath Pulakuram) మాట్లాడుతూ – ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా(Prabuthva Juniour Kalasala) ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఆ రోజు మా జీవితాల్లో ఒక బిగ్ డే అనుకోవాలి. ఎన్నో ఇబ్బందులు దాటి మా సినిమాను రిలీజ్ వరకు తీసుకురావడమే పెద్ద విజయంగా భావిస్తున్నాం. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా. యువత, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. ట్రైలర్ లో మీరు సినిమా క్వాలిటీ ఎంత బాగుందో చూశారు. మేము క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా తెరకెక్కించాం. ఈ సినిమా రిహార్సల్స్, వర్క్ షాప్స్ కు కొన్ని నెలల టైమ్ కేటాయించాం. ఆర్టిస్టులను మా ఊరు పుంగనూరు తీసుకెళ్లి రాయలసీమ యాస నేర్పించాం. డబ్బింగ్ కోసమే 8 నెలల టైమ్ వెచ్చించాం. దీన్ని బట్టి మేము మూవీ క్వాలిటీ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నామో అర్థం చేసుకోండి.

మనం ఉన్నా లేకున్నా సినిమా మాత్రం ఎప్పటికీ నిలిచిఉంటుంది. ఆ సినిమా బాగుండాలి. నేను పుట్టి పెరిగింది చదివింది పుంగనూరులో. మా ఊరు గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అలాంటి మా ఊరి పేరును టైటిల్ లో పెట్టి మా ఊరిలోనే సినిమా చిత్రీకరించాం. అలా మా ఊరుకు నా వంతుగా ఒక గుర్తింపు తీసుకురావడం గర్వంగా ఉంది.

Shagna Sri Venun| హీరోయిన్ షాజ్ఞ మాట్లాడుతూ – ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′సినిమాతో హీరోయిన్ గా మీ ముందుకు రావడం సంతోషంగా ఉంది. మా డైరెక్టర్ శ్రీనాథ్ నాతో మంచి పర్ ఫార్మెన్స్ చేయించారు. ప్రణవ్ మంచి కోస్టార్. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో అన్ని ఎమోషన్స్ కలిసి ఉన్న సినిమా ఇది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఇలాంటి మంచి మూవీని సపోర్ట్ చేయండని రిక్వెస్ట్ చేశారు.

Pranav Preetham| సిటీలో పెరిగే మాకు పుంగనూరు లాంటి అందమైన ఊరిలో షూటింగ్ చేయడం ఎంతో ప్లెజెంట్ గా ఉండేదని హీరో ప్రణవ్​ ప్రీతం అన్నారు.. నాకు హీరో కావాలనే డ్రీమ్ లేదు. కొన్ని షార్ట్ ఫిలింస్ చేశాను. డైరెక్టర్ శ్రీనాథ్ మా అందరికీ లైఫ్ ఇచ్చారని చెప్పాలి. మా సినిమాలో హీరోయిన్ షాజ్ఞ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆమెకు మంచి పేరొస్తుంది. హీరోగా నాకూ మంచి గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నా. ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′సినిమా ఈ నెల 21న థియేటర్స్ లో తప్పకచూస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

 

నటీనటులు ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల

సాంకేతిక వర్గం
బ్యానర్: బ్లాక్ ఆంట్ పిక్చర్స్, రైటర్, ఎడిటర్ అండ్ డైరెక్టర్: శ్రీనాథ్ పులకురం,నిర్మాత: భువన్ రెడ్డి కొవ్వూరి,డి.ఒ.పి : నిఖిల్ సురేంద్రన్
ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్, పాటలు: కార్తీక్ రోడ్రిగజ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సయ్యద్ కమ్రాన్, పీఆర్ఓ – సురేష్ కొండేటి
కొ డైరెక్టర్ : వంశీ ఉదయగిరి

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *