Kangana Ranaut : ‘బాలీవుడ్‌ ఓ నిస్సహాయ ప్రదేశం.. అక్కడ టాలెంట్​ను తొక్కేస్తారు’

ManaEnadu:మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా ‘ఎమర్జెన్సీ’ (Emergency) మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో కంగనా ఈ సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే పలు ఛానెల్స్​కు ఇంటర్వ్యూ (Emergency Movie Promotions) ఇస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా తనపై బాలీవుడ్ పన్నిన కుట్ర గురించి మాట్లాడింది. తన సినిమాల్లో యాక్ట్‌ చేయొద్దని చాలా మందికి చెప్పారని ఆరోపించింది.

టాలెంట్ ఉన్న వాళ్లను తొక్కేస్తారు

ఈ సందర్భంగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) మరోసారి హిందీ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్​లో టాలెంట్ ఉన్న వారిని చూసి బడా బడా నటులు తట్టుకోలేరని, వారిని చూసి ఈర్ష్య పడతారని తెలిపింది. వారి టాలెంట్​ను అడుగడుగునా తొక్కేస్తుంటారని ఆరోపణలు చేసింది. అసలు ఆ పరిశ్రమలో ప్రోత్సహించే వారే ఉండరని వెల్లడించింది. తను కూడా అక్కడ ఇలాంటి సమస్యలే ఎదుర్కొన్నానని, అయితే తాను వాటిపై గొంతెత్తడంతో తనను బహిష్కరించారని చెప్పింది.

సమస్య వాళ్లదా నాదా?

“నేను నా వరకు చాలా మంచి వ్యక్తిని. నాతో ఉన్న వారితో ఇతరులతో మర్యాదపూర్వకంగా మెలుగుతాను. నన్ను నమ్మారు, ఇష్టపడ్డారు కనుకే ఎన్నికల్లో (Himachal ELections) గెలిపించారు. ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతో ప్రేమాభిమానం పొందాను. ఇదంతా చూస్తుంటే నన్ను ఇష్టపడేవారు చాలా మందే ఉన్నారనిపిస్తుంది. కానీ కొంతమందికి నాతో సమస్య ఉంది. అయితే ఆ సమస్య నాలో ఉందా వాళ్లలో ఉందా అనేది వాళ్లు ఆలోచించాల్సిన విషయం.

బాలీవుడ్ ఈజ్ హోప్​లెస్

“నా దృష్టిలో బాలీవుడ్ (Bollywood) ఒక హోప్​లెస్ (నిస్సహాయక) ప్రదేశం. ఈ ఇండస్ట్రీలో కొంతమంది స్టార్స్ అని చెప్పుకుంటున్న వాళ్లు ఎవరికీ సాయం చేయరు. కానీ టాలెంట్ ఉన్న వాళ్లు కనిపిస్తే మాత్రం వాళ్లను చూసి అసూయ పడతారు. వాళ్ల కెరీర్ నాశనం చేయడానికి బీష్మించుకు కూర్చుంటారు. ప్రత్యేకంగా వాళ్ల కోసం పీఆర్ టీమ్​ను ఏర్పాటు చేసి వారిపై అవాస్తవాలు, దారుణాలు, తప్పుడు వార్తలను వైరల్ చేయిస్తారు. చివరకు ఇండస్ట్రీ వారిని బహిష్కరించేలా సిట్యుయేషన్ క్రియేట్ చేస్తారు. నా విషయంలో అలాగే జరిగింది. నేను అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. అందుకే ఇండస్ట్రీ నన్ను బహిష్కరించింది.” అని కంగనా రనౌత్ (Kangana Comments) సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కంగన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ భామకు మద్దతుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *