అమెరికాలో ఇజ్రాయిల్ ర్యాలీపై ఉగ్రదాడి.. ఆరుగురికి తీవ్రగాయాలు 

అమెరికా (America)లోని కొలరాడోలో ఇజ్రాయిలీల (Israel)పై ఓ పాలస్తానీ పెట్రోల్ బాంబులతో ఉగ్రదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఎఫ్ బీఐ వెల్లడించింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కొలరాడోలోని బౌల్డర్ పట్టణంలో ఆదివారం ఇజ్రాయిలీ బందీలను విడుదల చేయాలని ‘రన్ ఫర్ దేర్ లైవ్స్’ అనే స్మారక యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పాలస్తీనాకు చెందిన వ్యక్తి మాల్టోవ్ కాక్ టెయిల్స్ ( ఒక రకమైన పెట్రోల్ బాంబు) (terrorist attack) సీసాలో పట్టుకుని వచ్చి వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ సమయంలో అతడు ఫ్రీ పాలస్తీనా అంటూ అరిచాడని అక్కడి ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.

ఇజ్రాయిలీలపై దాడి చేస్తూ..

ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిని మొహమ్మద్ సబ్రీ సోలిమాన్‌గా గుర్తించారు. అతను ఇజ్రాయిలీలపై దాడి చేస్తూ ‘ఫ్రీ పాలస్తీనా ‘Palestine’ అంటూ నినాదాలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాడి సమయంలో మీరు ఎంతమంది పాలస్తీనా పిల్లల్ని చంపారు అంటూ ఆవేశంగా ప్రశ్నించాడు.

ప్రాణాలతో బయటపడటం అదృష్టం

ఈ ఘటన తర్వాత చాలా మంది ప్రాణాలతో బయటపడటం అదృష్టమని బౌల్డర్ (Boulter City) పోలీస్ చీఫ్ స్టీఫెన్ రెడ్‌ఫెర్న్ అన్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు తక్షణమే స్పందించి సోలిమాన్‌ను అరెస్టు చేశారని తెలిపారు. ఎఫ్‌బీఐ అధికారి క్వాష్ పటేల్ ఈ ఘటన ఉగ్రదాడి అని పేర్కొన్నారు. కొలరాడో అటార్నీ జనరల్ ఫిల్ వైసర్ ఇది కావాలనే ద్వేషంతో చేసిందన్నారు. అమెరికాలో ఇజ్రాయెల్‍ పాలస్తీనా యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో అమెరికాలో యూదులకు వ్యతిరేకంగా దాడులు పెరుగుతున్నాయని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. కొలరాడో గవర్నర్ జారెడ్ పోలిస్ ఈ ఘటనపై స్పందిస్తూ హింసను ప్రోత్సహించే ఎలాంటి చర్యలకూ ఈ దేశంలో స్థానం లేదని తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *