తెలంగాణ(Telangana)లోని పదో తరగతి విద్యార్థుల(10th Class Students)కు అలర్ట్. టెన్త్ క్లాస్ విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షల(Pre Final Examinations) తేదీలను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (TSBSE) ఖరారు చేసింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ను గురువారం విడుదల చేసింది. మార్చి 6వ తేదీ నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రోజూ మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. అలాగే ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలను గంటన్నర వ్యవధిలోనే నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇక SSC వార్షిక పరీక్షల(Annual Examinations)ను మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
ప్రీ ఫైనల్ పరీక్షల షెడ్యూల్ ఇదే..
మార్చి 06 – ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 07 – సెకండ్ లాంగ్వేజ్
మార్చి 10 – థర్డ్ లాంగ్వేజ్
మార్చి 11 – మ్యాథమేటిక్స్
మార్చి 12 – ఫిజికల్ సైన్స్
మార్చి 13 – బయోలాజిక్ సైన్స్
మార్చి 15 – సోషల్ స్టడీస్






