టాలీవుడ్ సినీ నిర్మాత కేపీ చౌదరి (Krishna Prasad Chaudhary) గోవాలో ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో అతడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, ఆర్థిక, అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వరలక్ష్మి టిఫిన్ డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న కేపీ చౌదరి (KP Chaudhary Suicide).. చాలా మంది సినిమా సెలబ్రిటీలకు డ్రగ్స్ విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఖమ్మం జిల్లాకు చెందిన కేపీ చౌదరి 2016లో సినిమా రంగంలోకి వచ్చాడు. తెలుగులో కబాలి (Kabali) సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. 2023లో అతడి వద్ద 93 గ్రాముల కొకైన్ దొరకడంతో పోలీసులు ఆయణ్ను అరెస్టు చేశారు. కేపీ చౌదరి అరెస్ట్‌తో సినీ డ్రగ్స్ లింక్స్ తెర మీదకు వచ్చాయి. అప్పట్లో ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.






