
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ వారం మిశ్రమంగా చలించొచ్చు. సెప్టెంబర్లో యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉండటం, కంపెనీల ఫలితాలు, GST సంస్కరణలు సూచీలకు ఊతమిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్స్(Trump Tarrifs), రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వివరణపై స్పష్టత లేకపోవడం, మారుతున్న జియో పొలిటికల్ ఈక్వేషన్స్ ప్రతికూల సంకేతాలు పంపిస్తున్నాయి. అందుకే ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకున్న షేర్లలోనే పెట్టుబడులు పెట్టడం మంచిది. గతవారం ఆటో, IPO, వినియోగ, రియల్టీ రంగాల షేర్లు జోరు ప్రదర్శించాయి. ప్రభుత్వ రంగ కంపెనీలు, డిఫెన్స్, బ్యాంకింగ్ రంగాల షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీ శుక్రవారం 200పాయింట్లకు పైగా పతనమవ్వడం లాభాల స్వీకరణను సూచిస్తోంది. మద్దతు దొరికితే మళ్లీ పుల్‌బ్యాక్ ర్యాలీకి అవకాశం ఉంటుంది.
స్టాక్ రికమెండేషన్స్
ఎన్ఎస్‌డీఎల్: కొన్ని రోజుల కిందే స్టాక్ మార్కెట్లో నమోదైన ఈ షేర్లు(Shares) మెరుగ్గా రాణిస్తున్నాయి. ఐపీవో గరిష్ఠ స్థాయి తర్వాత షేర్లు టైట్‌గా చలిస్తోంది. ఫ్లాగ్ స్ట్రక్చర్ కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.1275 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.1450 టార్గెట్ ధరతో రూ.1250 పై స్థాయిలో అక్యూములేట్ చేసుకోవాలి. పడే కొద్దీ కొనుగోలు చేయాలి. రూ.1210 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకోవాలి.
ఎగ్జిట్ ఇండస్ట్రీస్: కొన్ని నెలలుగా డౌన్‌ట్రెండులో పయనిస్తున్న ఈ షేర్లు ప్రస్తుతం రివర్సల్ అవుతున్నాయి. హయ్యర్ హై ఫామ్ చేస్తూ అక్యూములేషన్ జోన్లో ఉన్నాయి. బ్యాటరీ ఇండస్ట్రీ బ్రెడ్త్ సైతం మెరుగవుతోంది. స్వల్ప, మధ్యకాలిక మూమెంటమ్ బాగుంది. గత శుక్రవారం రూ.396 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు రూ.455 టార్గెట్ ధరతో రూ.380/390 శ్రేణిలో ప్రవేశించాలి. రూ.370 వద్ద స్టాప్‌లాస్ ఎంచుకోవాలి.
సుప్రీమ్ ఇండస్ట్రీస్: గత ఏడాది జూన్ నుంచి డౌన్‌ట్రెండులో కొనసాగుతున్న ఈ షేర్లు ఈ ఏడాది మే నుంచి రివర్సల్ బాట పట్టాయి. ప్రస్తుతం కీలక నిరోధ స్థాయి రూ.4700 వద్ద చలిస్తున్నాయి. దీన్ని అధిగమిస్తే మరింత పెరగడం ఖాయం. మూమెంటమ్ క్రమంగా మెరుగవుతోంది. గత శుక్రవారం రూ.4637 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.4780 టార్గెట్ ధరతో రూ.4600 శ్రేణిలో పొజిషన్ తీసుకోవాలి. రూ.4560 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకోవాలి.
ఇప్కా ల్యాబ్: కొన్ని నెలలుగా అక్యూములేషన్ జోన్లో కొనసాగుతున్న ఈ షేర్లు ప్రస్తుతం కీలక మద్దతు స్థాయి రూ.1350 నుంచి రివర్సల్ అయ్యాయి. డార్వాస్ బాక్స్ మాదిరిగా కొంతమేర స్వింగ్ లభించే సూచనలు ఉన్నాయి. గత శుక్రవారం రూ.1418 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు రూ.1580/1650 టార్గెట్ ధరతో రూ.1400 స్థాయిలో పొజిషన్ తీసుకోవాలి. రూ.1360 వద్ద స్టాప్‌లాస్ తప్పనిసరి.
ఆదిత్యా ఇన్ఫోటెక్: కొన్ని రోజులు క్రితమే మార్కెట్లో లిస్టైన ఈ షేర్లు దూకుడు మీదున్నాయి. నిఫ్టీ(Nifty)తో పోలిస్తే జోరు ప్రదర్శిస్తున్నాయి. గత శుక్రవారం రూ.1360 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ1550 టార్గెట్ ధరతో రూ.1300 శ్రేణిలో కొనుగోలు చేయాలి. రిస్క్ ప్రొఫైల్‌ను బట్టి దీర్ఘకాలం మదుపు చేసుకోవచ్చు. రూ.1260 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకోవాలి.