
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆగస్టు 1వ తేదీ నుంచి అనేక దేశాలపై అధిక సుంకాలను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ టారిఫ్స్(Tarrifs) 10% నుంచి 70% వరకు ఉండవచ్చని, వాణిజ్య ఒప్పందాలను త్వరగా కుదుర్చుకోవాలని దేశాలకు ఒత్తిడి చేస్తున్నారు. ఏప్రిల్ 2న ప్రకటించిన ఈ సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేసినప్పటికీ, జులై 9లోగా ఒప్పందాలు కుదరకపోతే పాత సుంకాల స్థాయికి తిరిగి వస్తాయని ఆ దేశ రెవెన్యూ మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈరోజు (సోమవారం) నుంచి 12 దేశాలకు సుంకాల రేట్ల గురించి ట్రంప్ లేఖలు(Letters) పంపనున్నారు, మరిన్ని దేశాలకు తదుపరి రోజుల్లో లేఖలు పంపించనున్నట్లు వైట్ హౌస్(White House) పేర్కొంది.
వినియోగ వస్తువుల ధరలు పెరిగే అవకాశం
ఈ సుంకాలు తైవాన్, యూరోపియన్ యూనియన్ వంటి ప్రధాన వాణిజ్య భాగస్వాములను ప్రభావితం చేయనున్నాయి. జపాన్(Japan) ప్రధాని షిగెరు ఇషిబా ఈ సుంకాలపై రాజీ పడబోమని స్పష్టం చేశారు. BRICS దేశాలు ఈ సుంకాలను చట్టవిరుద్ధమని ఖండించాయి, ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హానికరమని హెచ్చరించాయి. ఈ సుంకాల వల్ల అమెరికాలో వినియోగ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని రాయిటర్స్ సర్వే తెలిపింది. ఇప్పటివరకు UK, వియత్నాం, చైనాతో కొన్ని ఒప్పందాలు కుదిరాయి, కానీ చాలా దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ విధానం USA ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని ట్రంప్ భావిస్తున్నప్పటికీ, దీర్ఘకాలికంగా ద్రవ్యోల్బణం, వాణిజ్య యుద్ధాల(Trade Wars)కు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Latest from @POTUS regarding tariff letters delivered starting 12pm et tomorrow on July 7, 2025. 🇺🇸 pic.twitter.com/FSdXpNRiPn
— National Youth Leaders of America (@LeadersOfUSA) July 7, 2025