
ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలకు 25 మంది మరణించారు. అస్సాం రాజధాని గౌహతి (gowhathi)లో మట్టి కూరుకుపోయి ఐదుగురు చనిపోగా.. ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. గోలాఘాట్, లక్ష్మీపుర్ జిల్లాల్లో భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. దీంతో ఆ ప్రాంతంలో ముగ్గురు చనిపోయారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఓ వాహనం వరద నీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. మొత్తం రాష్ట్రంలో తొమ్మిది మంది చనిపోయారు.
త్రిఫుర మేఘాలాయ రాష్ట్రాల్లో..
గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షానికి త్రిపుర, మేఘాలయా, మిజోరం వరదలు పోటెత్తాయి. దీంతో ఎనిమిది మంది మృతి చెందారు. మణిపూర్ (manipur)లో మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల ఇంఫాల్ నగరంలో ప్రజలు ఇళ్ల లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది. నది ఒడ్డున నివసిస్తున్నవారు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు.
🚨 Mangan,Sikkim-Water level of Teesta river rises after heavy rains,threat of flood! 🌊
⚠️ Administration has issued an alert.
Appeal to people to go to higher places.#INDIA #Northeast #Sikkim #TeestaRiver #IMD #FloodAlert #Weather #Monsoon2025 #Assam #Kerala #manipur #Rain pic.twitter.com/9x9M5YcjoU— Sanjeev (@wing4destiny) June 1, 2025
చిక్కుకున్న 1500 మంది పర్యాటకులు
సిక్కిం రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడకు పర్యాటకానికి వెళ్లిన 1500 మంది వర్షాలకు అక్కడే చిక్కుకుపోయారు. ఉత్తర సిక్కింలోని మంగన్ జిల్లా తిస్తా నదిలో పర్యాటకులు ప్రయాణిస్తున్న వాహనం పడిపోవడంతో ఒకరు చనిపోయారు. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. అస్సాం (assam) లో 17 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం వరద సహాయక చర్యలు కొనసాగుతుండగా.. లక్ష్మిపూర్ లోని ఒకే జిల్లాలో 40 వేల మంది వరద బాధితులు ఉన్నట్లు సమాచారం.
Heavy flooding in Manipur after incessant rains.This is from Imphal East.Keeping everyone in our prayers at this time in the state as well as across Northeast where water levels are rising & lives are lost.Conflict, Climate Crisis has marked us all here for decades @UNEP pic.twitter.com/U5HUWZll9X
— Binalakshmi Nepram (@BinaNepram) May 31, 2025