ManaEnadu: భారత్‌లో దీపావళి(Diwali) పండుగ తరువాత దేశ వ్యాప్తంగా వాయు కాలుష్యం (Air pollution) భారీగా పెరిగింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(Air Quality Index) 400 దాటింది. ఇది చాలా ప్రమాదకర స్థాయి. ఒక్క ఢిల్లీలోనే కాదు.. చాలా నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అయితే, దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన గాలి(Fresh Air) ఉన్న నగరం/నగరాలు ఏంటో తెలుసా? ఉత్తమ గాలి నాణ్యత ఉన్న నగరం ఏది? దేశంలో స్వచ్ఛమైన గాలి ఉన్న నగరాలు/ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈశాన్య రాష్ట్రాల్లోనే అధికం
పరిశుభ్రమైన గాలి ఉన్న నగరాల జాబితాను సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Central Pollution Control Board) తాజాగా వెల్లడించింది. ఆ డేటా ప్రకారం.. సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్ కేవలం 29 AQIని నమోదు చేసింది. ఇది దేశంలో అత్యంత స్వచ్ఛమైన గాలి లభించే నగరంగా ఉంది. ఇక రెండో స్థానంలో మిజోరాం రాజధాని ఐజ్వాల్ ఉంది. ఇక్కడ AQI 32గా ఉన్నట్లు CPCB నివేదించింది. ఆ తర్వాత వరుసగా దక్షిణాది నగరాలైన మంగుళూరు (34), తిరునెల్వేలి (35), చామరాజనగర్ (40), కోలార్ (40), కలబురగి (41), ఉడిపి (45), త్రిసూర్ (46), టుటికోరిన్ (46), కొల్లాం (48)లలో గాలి నాణ్యత అత్యంత స్వచ్ఛంగా ఉందని నివేదిక పేర్కొంది.
అత్యంత కాలుష్య నగరాలు ఇవే..
దేశంలో ఈ ఏడాది కాలుష్యం తీవ్రంగా పెరిగిపోయిందని CPCB తెలిపింది. వాహనాల నుంచి వచ్చే పొగ(Smoke from vehicles)తో పాటు పంట పొలాల్లోని వ్యర్థాల(Wastege from crop fields)ను తగలబెట్టడం వంటి చర్యలతో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతోందని తెలిపింది. కాగా, ఈ ఏడాదికిగాను అత్యంత కాలుష్య నగరాల జాబితాలో బిహార్‌లోని కతిహార్ తొలిస్థానంలో నిలిచింది. అక్కడ గాలి నాణ్యత (AQI) 360 పాయింట్లకు చేరింది. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ (354), నోయిడా(328), ఘజియాబాద్(304) నగరాలు ఉన్నాయి. ఇక, బెగుసరాయ్, బల్లాబ్ గఢ్, ఫరీదాబాద్, కైతాల్, గురుగ్రామ్, గ్వాలియర్ నగరాలు కూడా అత్యంత కాలుష్య నగరాలని తాజా నివేదికలో తేలింది.