25 ఏళ్ల తర్వాత మళ్లీ అదే రోజు ‘విక్టరీ రిపీట్’

ఈ సంక్రాంతి పండుగకు మూడు బడా సినిమాలు రిలీజ్ అయ్యాయి. జనవరి 10వ తేదీన రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్ (Game Changer)’, 12న బాలకృష్ణ ‘డాకు మహారాజ్ (Daaku Maharaaj)’, 14వ తేదీన వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు థియేటర్లలో విడుదలయ్యాయి. అయితే ఈ మూడు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలు మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నాయి. కలెక్షన్లు బ్లాక్ బస్టర్ అని అంటున్నా.. ప్రేక్షకుల్లో మాత్రం మిశ్రమ స్పందన కనిపిస్తోంది.

బ్లాక్ బస్టర్ పొంగల్

మొదటి నుంచి బ్లాక్ బస్టర్ అంటూ ప్రమోషన్స్ చేస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ సినిమా అంతటా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ (Venkatesh) హీరోగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులు ఎలాంటి సినిమా కోరుకుంటారో అలాంటి కథతోనే వెంకీ థియేటర్లలోకి వచ్చారని ఆడియెన్స్ అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. చాలా కాలం తర్వాత వెంకటేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

25 ఏళ్ల క్రితం కల్ట్ క్లాసిక్

ఈ నేపథ్యంలో తాజాగా సురేశ్ ప్రొడక్షన్స్ (Suresh Productions) ఓ ప్రత్యేక పోస్టు పెట్టింది. “సరిగ్గా 25 ఏళ్ల క్రితం జనవరి 14వ తేదీన వెంకటేశ్ నుంచి ఓ కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ వచ్చింది.. మళ్లీ ఇప్పుడు అదే ఫ్యామిలీ బ్లాక్ బస్టర్‌‌‌ని వెంకీ రిపీట్ చేశారు.” అంటూ ఈ పోస్టులో పేర్కొన్నారు. మరి పాతికేళ్ల క్రితం వచ్చిన ఆ బ్లాక్ బస్టర్ చిత్రం ఏంటంటే.. ‘కలిసుందాం రా‘. 2000 సంవత్సరంలో జనవరి 14న సంక్రాంతి కానుకగా ‘కలిసుందాం రా (Kalisundam Raa)’ సినిమా రిలీజ్ అయింది. ఆ సమయంలో ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.

25 ఏళ్ల తర్వాత మరో బ్లాక్ బస్టర్

ఇప్పటికీ ఈ మూవీ టీవీలో ఎప్పుడు వచ్చినా.. ఇంటిల్లిపాది కలిసిమెలసి ఆ సినిమా చూస్తుంటారు. ఈ చిత్రంలోని పాటలు క్లాసిక్ గా నిలిచిపోయాయి. ఇందులో కామెడీ, ఫ్యామిలీ డ్రామా, వెంకటేశ్ యాక్టింగ్, కుటుంబంలో ఉండే ఎమోషన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వెంకటేశ్ కెరీర్ లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోయింది. అప్పటికే ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న వెంకీని మరో మెట్టు ఎక్కించింది ఈ చిత్రం. ఇక సరిగ్గా 25 ఏళ్ల తర్వాత జనవరి 14వ తేదీన సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకటేష్ మరోసారి ప్రేక్షకులను ఫిదా చేశారు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *