‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ విక్టరీ వెంకటేష్ (Venkatesh) ఈ సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జనవరి 14వ తేదీన విడుదలైంది. రిలీజ్ అయిన రోజు నుంచి సూపర్ హిట్ కలెక్షన్లు వసూల్ చేస్తోంది. అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ మూడో సినిమాతో ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టింది.
రూ.300 కోట్ల కలెక్షన్స్
తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ సినిమా మరో రికార్డు క్రియేట్ చేసింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తెలుగులో ఈ రికార్డు సాధించిన తొలి సినిమాగా రికార్డు సృష్టించింది. మరోవైపు టాలీవుడ్ సీనియర్ హీరోల్లో రూ.300 కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చిన నటుడిగా వెంకటేశ్ గుర్తింపు పొందాడు.
HISTORY HAS A NEW NAME!
LEGACY HAS A NEW BENCHMARK! #SankranthikiVasthunam sets the bar SO HIGH with a RECORD-BREAKING RAMPAGE🔥❤️🔥₹303 CRORE+ worldwide Gross & #BlockbusterSankranthikiVasthunam continues it’s DOMINATION at the box office 💥💥
ALL TIME INDUSTRY HIT FOR A… pic.twitter.com/NA0THATePy
— Sri Venkateswara Creations (@SVC_official) February 3, 2025
బుల్లిరాజు హైలైట్
ఇక ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఇక ఈ సినిమాలో బుల్లిరాజు పాత్రకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు నెల రోజులు కావొస్తున్నా.. ఇంకా థియేటర్లలో హౌస్ ఫుల్ నడుస్తోంది.






