విక్టరీ వెంకటేష్(Victory Venkatesh).. అలియాస్ వెంకీమామ. అభిమానులు ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే పేరు. ఆరు పదుల వయస్సులోనూ కుర్రకారులో జోష్ నింపే వెంకీ.. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam)’ మూవీతో సూపర్ హిట్ కొట్టారు. ఈ మూవీ వెంకటేష్ కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. అనిల్ రావిపూడి(Anil Ravipudi), వెంకీ కాంబోలో వచ్చిన ఈ మూవీ వసూళ్ల పరంగానూ దుమ్మురేపింది. ఇక ఈ మూవీ వచ్చి దాదాపు 6 నెలలు పూర్తి కావొస్తోంది. దీంతో తన తర్వాత సినిమాలపై వెంకీమామ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్(Tollywood)లో వెంకీ తర్వాతి ప్రాజెక్టులపై చర్చ జరుగుతోంది.
![]()
మెగాస్టర్ మూవీలో కీలక రోల్
వెంకటేష్ ఇప్పుడు మళ్లీ లైన్లోకి వచ్చేశాడు. ఏకంగా మూడు సినిమాలను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)తో చేస్తున్న సినిమా. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నారట. ఈ సినిమా కోసం ఏకంగా నెల రోజులు పాటు డేట్స్ ఇచ్చాడట వెంకీమామ. ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్(Trivikram)తోనూ ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్(Pre Production Works) కూడా మొదలైపోయింది.

దృశ్యం-3 ఓకేసారి మూడు భాషల్లో..
ఈ మూవీ షూటింగ్ ఆగస్టులో షూటింగ్ మొదలయ్యే ఛాన్సుంది. ఇక వచ్చే ఏడాది సమ్మర్లో దీనిని విడుదల చేసేందుకు ప్లాన్స్ వేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉండగా ఇప్పటికే రెండు పార్టుల్లో వచ్చి దృశ్యం(Dhrishyam) సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా దృశ్యం-3(Dhrishyam-3) సినిమాను కూడా వెంకీ మామ లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో ఈ మూవీని రీమేక్ చేసేవారు. కానీ ఈసారి మలయాళం, తెలుగుతో పాటు హిందీ భాషల్లో ఒకేసారి షూట్ చేయడానికి దృశ్యం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మోహన్ లాల్, వెంకటేష్, అజయ్ దేవగన్ ముగ్గురు ఆయా భాషల్లో నటిస్తున్నారు. మొత్తానికి వెంకీ మామ(Venky Mama) బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో ఫ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.







