నెదర్లాండ్స్ వరకు నిమ్స్ ఘనకీర్తి.కేసీఆర్ సర్కార్ పై ప్రశంసలు

నిమ్స్ లో అందుతున్న చికిత్సలపై అధ్యయనం చేసేందుకే తామిక్కడికి వచ్చినట్టు తెలిపారు నెదర్లాండ్స్ హెల్త్ మినిస్టర్ జాన్ కైపర్స్. హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారాయన.

నిజామ్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఘనకీర్తిని నెదర్లాండ్స్ ప్రభుత్వం కూడా గుర్తించింది. ఆదేశ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిని సందర్శించి ఇక్కడ అందుతున్న సేవలను మెచ్చుకున్నారు. నెదర్లాండ్స్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జాన్ కైపర్స్, మరికొంతమంది ప్రతినిధులతో కలసి గురువారం నిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. డయాలసిస్, క్యాన్సర్, యూరాలజీ విభాగాలను పరిశీలించి అక్కడ అందుబాటులో ఉన్న పరికరాలు, చికిత్సల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిమ్స్ లో వైద్య సేవలు బాగున్నాయని ప్రశంసించారు.

నిమ్స్ లో అందుతున్న చికిత్సలపై అధ్యయనం చేసేందుకే తామిక్కడికి వచ్చినట్టు తెలిపారు నెదర్లాండ్స్ హెల్త్ మినిస్టర్ జాన్ కైపర్స్. హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారాయన. తెలంగాణలో నిమ్స్ ఆస్పత్రి ప్రతిష్ట గురించి తాము ఇప్పటికే చాలాసార్లు విన్నామని, అయితే ఇప్పుడు స్వయంగా చూసేందుకు ఇక్కడికి వచ్చామని చెప్పారు జాన్ కైపర్స్.

హాస్పిటల్లోని డయాలసిస్, క్యాన్సర్, యూరాలజీ విభాగాలను నెదర్లాండ్ బృందం పరిశీలించింది ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలు బాగున్నాయని నెదర్లాండ్ హెల్త్ మినిస్టర్ ప్రశంసించారు. నిమ్స్ హాస్పిటల్ గురించి చాలా విన్నానని, తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం అందిస్తున్న పథకాలు, వైద్యసేవల గురించి అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. వివిధ విభాగాల పనితీరు గురించి అధ్యయనం చేస్తున్నామని అన్నారు. నిమ్స్ ఆస్పత్రి వైద్య సేవలతోపాటు.. తెలంగాణలో అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు కూడా బాగున్నాయని కితాబిచ్చారు.

Share post:

Popular