ప్రముఖ ఓటీటీలో బేబి మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు.

Baby Movie : ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) కలిసి నటించిన లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీ బేబి (Baby). ఈ సినిమాను కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వం వహించగా.. SKN నిర్మించారు. జూలై 14న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఇక ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది.

యువ నటుడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ బేబీ. ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ మరో కీలకపాత్రలో నటించారు. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్ నిర్మించారు. ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలించాయి. ఇలా సినిమా విడుదలకు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ జూలై 14న గ్రాండ్‌గా విడుదల అయింది. అంతేకాదు మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య తమ నటనతో అదరగొట్టారు. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ యూత్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. స్కూల్ లో చిగురించిన ప్రేమ, ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమ.. కాలేజీకి వెళ్లాక ఎలా మారుతుందనే సన్నివేశాలతో సినిమాను అల్లుకున్నారు. ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు అమెరికాలోను అదరగొడుతోంది. 10 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటి వరకు రూ.90 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి వావ్ అనిపించింది. ఈ సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అవడంతో రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను చూసిన అల్లు అర్జున్, రవితేజ, సుకుమార్ వంటి పలువురు సినీ ప్రముఖులు టీంమ్‌‌ను అభినందింస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో వైష్ణవి చైతన్య నటనకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు

ఇక లేటెస్ట్‌గా ఈ సినిమా ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోంది. అయితే సుమారు 3గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీని ఓటీటీలో మాత్రం సుమారు నాలుగు గంటల నిడివితో విడుదలకానుందని తెలుస్తోంది. ఆహాతో పాటు నెట్ ఫ్లిక్స్‌లో బేబి విడుదల కానుంది. ఈ లేటెస్ట్ వర్షెన్‌లో ఓ సాంగ్‌తో పాటు కొన్ని సీన్లను కూడా చేర్చనున్నారట. వైష్ణవి చైతన్య, విరాజ్ మధ్య వచ్చే సీక్వెన్స్ ఎక్కువగా ఉంటాయట. ఈ సినిమా ఆగష్టు 25న ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహాలో ప్రసారం కానుందని తెలుస్తోంది. 

ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో కథానాయికగా నటించిన వైష్ణవి.. తన పాత్రలో ఒదిగిపోయింది. విరాజ్ అశ్విన్ కూడా ఉన్నంతలో పర్వాలేదనపించాడు. ఇతర పాత్రల్లో నాగబాబు, లిరిష, వైవా హర్ష తదితరులు నటించారు

Share post:

లేటెస్ట్