Mana Enadu: టెస్ట్ ర్యాంకింగ్స్(Test Rankings)లో యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్.. విరాట్(Virar Kohli)ను వెనక్కునెట్టి మెరుగైన ర్యాంక్‌ను సొంతం చేసుకొన్నాడు. తాజాగా విడుదల చేసిన ICC టెస్ట్ ర్యాంక్‌ల జాబితాలో ముగ్గురు భారత బ్యాటర్లు టాప్-10లో నిలిచారు. జైస్వాల్ ఒక స్థానం మెరుగు పర్చుకొని ఏడో స్థానం దక్కించుకోగా.. కోహ్లీ రెండు మెట్లెక్కి 8వ ర్యాంక్ సొంతం చేసుకొన్నాడు. కాగా, రోహిత్(Rohith Sharma) ఒక స్థానం దిగజారి ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ టాప్‌లో ఉన్నాడు. మరోవైపు పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం ఇటీవల బంగ్లాదేశ్‍తో తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో డకౌట్, రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులే చేశాడు. దీంతో బాబర్ ఏకంగా ఆరు స్థానాలు దిగజారి 9వ ర్యాంక్‌కు పడిపోయాడు. బౌలర్లలో స్పిన్నర్ అశ్విన్ అగ్రస్థానంలో ఉండగా.. బుమ్రా మూడో ర్యాంక్‌లో, జడేజా ఏడో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్లలో జడేజా, అశ్విన్‌లు టాప్-2లో ఉండగా.. అక్షర్ పటేల్ ఆరో ర్యాంక్‌ను సొంతం చేసుకొన్నాడు.
ర్యాంకింగ్స్ ఇలా కేటాయిస్తుంది..
కాగా ఆటగాళ్ల కోసం, అంతర్జాతీయ మ్యాచ్‌లలో వారి ప్రదర్శనల ఆధారంగా ICC రేటింగ్ విధానాన్ని ఉపయోగిస్తుంది. ప్రతి ఫార్మాట్ (టెస్ట్, ODI , T20I)లలో వేర్వేరుగా ప్లేయర్లకు ర్యాంకులు కేటాయిస్తోంది. బ్యాటింగ్‌లో సెంచరీలు, హాఫ్ సెంచరీలకు అదనపు పాయింట్లతో పాటు సాధించిన పరుగుల సంఖ్య ఆధారంగా పాయింట్లు ఇస్తుంది. బౌలింగ్ విభాగంలో బౌలర్లు తీసిన ప్రతి వికెట్‌కు పాయింట్‌లను కేటాయిస్తుంది. దీంతోపాటు మెరుగైన బౌలింగ్ సగటు, స్ట్రైక్ రేట్, ఎకానమీ వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటుంది. ఆల్ రౌండర్ల కోసం ఒక ప్రత్యేక ర్యాంకింగ్ ఉంది. వారి బ్యాటింగ్, బౌలింగ్ రేటింగ్‌లను కలిపి వారికి ర్యాంకింగ్స్ కేటాయిస్తుంది.
టెస్టుల్లో బ్యాటింగ్‌లో టాప్-10లో ఉన్నది వీరే
1. జో రూట్ (ENG)
2. కేన్ విలియమ్సన్ (NZ
3. డారిల్ మిచెల్ (NZ)
4. హ్యారీ బ్రూక్ (ENG)
5. స్టీవెన్ స్మిత్ (AUS)
6. రోహిత్ శర్మ (IND)
7. యశస్వీ జైస్వాల్(IND)
8. విరాట్ కోహ్లీ (IND)
9. బాబర్ ఆజం (PAK)
10. ఉస్మాన్ ఖవాజా(AUS)
టెస్టుల్లో బౌలింగ్‌లో టాప్-10లో ఉన్నది వీరే
1. రవిచంద్రన్ అశ్విన్ (IND)
2. జస్ర్పీత్ బూమ్రా(IND)
3. జోష్ హెజిల్‌వుడ్(AUS)
4. కగిసో రబాడ(SA)
5. పాట్ కమిన్స్(AUS)
6. నాథన్ లియాన్(AUS)
7. రవీంద్ర జడేజా(IND)
8. షాషీన్ అఫ్రీది(PAK)
9. కైల్ జెమీసన్(NZ)
10. ప్రబాత్ జయసూర్య(SL)
టెస్టుల్లో ఆల్ రౌండర్లలో టాప్-10లో ఉన్నది వీరే
1. రవీంద్ర జడేజా(IND)
2. రవిచంద్రన్ అశ్విన్(IND)
3. షకీబ్ అల్ హసన్(BAN)
4. జో రూట్(ENG)
5. జాసన్ హోల్డర్(WI)
6. అక్షర్ పటేల్(IND)
7. బెన్ స్టోక్స్(ENG)
8. క్రిస్ వోక్స్(ENG)
9. పాట్ కమిన్స్(AUS)
10. మెహదీ హసన్ మిరాజ్(BAN)








