Election Schedule: మార్చి 13 తర్వాత లోక్ సభ ఎన్నికల షెడ్యూల్..?

లోక్ సభ ఎన్నికల ఏర్పాట్లలో కేంద్ర ఎన్నికల సంఘం బిజీగా ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తున్నారు. ఆయా చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తర్వాత ఉత్తర ప్రదేశ్, జమ్ము కశ్మీర్‌లో పర్యటిస్తారు. అలా అన్ని రాష్ట్రాల్లో అధికారుల పర్యటన మార్చి 13వ తేదీ లోపు ముగియనుంది.

లోక్ సభ ఎన్నికల ఏర్పాట్లలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission Of India) బిజీగా ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తున్నారు. ఆయా చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలో అధికారులు పర్యటిస్తున్నారు. తర్వాత ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh), జమ్ము కశ్మీర్‌లో (Jammu Kashmir) పర్యటిస్తారు. అన్ని రాష్ట్రాల్లో అధికారుల పర్యటన మార్చి 13వ తేదీ లోపు ముగియనుంది. 13వ తేదీ తర్వాత ఏ క్షణమైన లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా రాష్ట్రాల్లో ఉన్న చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్లతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంల తరలింపు, భద్రతా దళాల మొహరింపు, సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్ర అధికారులు స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ (AI) సాయం తీసుకోవాలని కేంద్ర అధికారులు భావిస్తున్నారు.

 

Share post:

లేటెస్ట్