7ఏళ్ల కష్టం..మూడు ప్రభుత్వ ఉద్యోగాలు..

తల్లిదండ్రుల కలను సాకారం చేయాలకున్నాడు. దాని కోసం ఏడేళ్లు నిర్విరామంగా శ్రమించాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అన్పించాడు. విమర్శించిన వారి చేతనే శభాష్‌ అనిపించుకున్నాడు. కృషి, పట్టుదల ఉంటే ఎదైనా సాధించవచ్చని నిరూపిస్తున్న రవి విజయ కథనం.

ఓకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపికై- అమ్మనాన్నల కలను నిజం చేసిన సూర్యాపేట యువకుడ ఒక ప్రభుత్వ ఉద్యోగమే గగనమైన ఈ రోజుల్లో మూడు ఉద్యోగాలు ఒకేసారి సాధించాడు ఈ యువకుడు. సాధారణ వ్యవసాయం కుటుంబంలో పుట్టి కలలు సాకారం చేసుకోవాలంటే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పట్టుదల, నిరంతర సాధనలతో వాటన్నింటిని అధిగమించి విజయం సాధించాడు ఈ ఔత్సాహికుడు. ఈ యువకుడి పేరు గడ్డం రవి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం అనంతారం గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు.

తెలంగాణ గురుకుల విద్యాలయాల పరీక్షలో(Gurukula Jobs) లైబ్రేరియన్‌ సైన్స్‌ విభాగం నుంచి మొదటి ర్యాంకు సాధించాడు. ఫలితంగా జూనియన్‌ లెక్చరర్‌, డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు సాధించాడు. మరోవైపు పీజీటీ విభాగం నుంచి రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే సహనం, ఓపిక అవసరం చాలా అవసరం. మూడు, నాలుగు సార్లు విఫలమైన ఎక్కడ వెనకడుగు వేయకుండా ముందుకు సాగాడు.

3 ఉద్యోగాల్లో డిగ్రీ లైబ్రేరియన్‌ లెక్చరర్‌గా చేరడానికి రవి సిద్ధమాయ్యాడు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) చేతులమీదుగా ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నాడు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో ఒత్తిడి, ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, సోదరుడి ప్రోత్సాహంతో ఉద్యోగం సాధించినట్లు చెబుతున్నాడు రవి.పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ప్రభుత్వ ఉద్యోగం సాధించినట్లు చెబుతున్నాడు రవి. లైబ్రేరియన్‌ కోర్సులకు సంబంధించి సరైన మెటీరియల్ లేక చాలా ఇబ్బందులు పడ్డాడు. సొంతంగా తానే మెటీరియల్ తయారుచేసుకుని చదవడం వలన ఉద్యోగం సాధించినని రవి అంటున్నారు.

ప్రభుత్వ కొలువు కోసం ఏడేళ్లు శ్రమించాడు రవి. కొన్నిపోటీ పరీక్షలలో ఒకటి, రెండు మార్కుల తేడాతో ఉద్యోగాలు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయని అంటున్నాడు. ఆ సమయంలో చాలా మంది నీ వల్ల కాదని విమర్శించారు. అయినా లక్ష్యంపైనే దృష్టి సారించి విజయకేతనం ఎగరేశాడు. అయితే మనం ఎందులో వెనుక ఉన్నామో గమనించి.. స్మార్ట్ వర్క్ చేస్తే విజయం సాధించవచ్చని చెబుతున్నాడు రవి.

Share post:

లేటెస్ట్