Ambajipeta Marriage Band: ఆ ఫేమస్ ఓటీటీలోనే అంబాజీ మ్యారేజీ బ్యాండు..స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు త్వరలోనే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహాలో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా పోస్టర్ ను షేర్ చేసింది. మల్లిగాడి మ్యాజికల్ వరల్డ్ కోసం సిద్ధం కండి అంటూ ట్వీట్ చేసింది.

Ambajipeta Marriage Band: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీపరిశ్రమలో పైకి వచ్చినవాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అప్పట్లో చిరంజీవి, రవితేజ ఉంటే..ఈ జనరేషన్ లో సుహాస్ ఉన్నారు. కమెడియన్ గా, కెరియర్ స్టార్ చేసి..క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ పాత్రలో ఇప్పుడు హీరోగా తన సత్తా చాటాడు. సుహాస్, శివానీ జంటగా వచ్చిన సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు. దుశ్యంత్ కటికనేని డైరెక్టర్. శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న కీలక పాత్ర పోషించారు. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. ముఖ్యంగా సుహాస్, శరణ్యల నటన సినిమాకు మరింత హైలెట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ మూవీలో ఓటీటీలో వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో త్వరలోనే ఈ సినిమా స్ట్రిమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా పోస్టర్ ను షేర్ చేసింది. మల్లిగాడి మ్యాజికల్ వరల్డ్ కోసం సిద్ధం కండి అంటూ ట్వీట్ చేసింది. మార్చి మొదటివారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.

హీరో సుహాస్ (మల్లికార్జున) బార్బర్ అలాగే మ్యారేజ్ బ్యాండ్ లోనూ పని చేస్తూ ఉంటాడు. మల్లికార్జున సోదరి పద్మావతి (శరణ్య) ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తుంది. ఇదే గ్రామంలోని వెంకట్( నితిన్ ) పద్మావతి మధ్య ఏదో సంబంధం ఉందంటూ ఊర్లో అందరు అనుకుంటారు. ఈ క్రమంలో పద్మావతి తమ్ముడు సుహాస్ వెంకట్ మధ్య గొడవలు మొదలవుతాయి. మరో వైపు సుహాస్.. వెంకట్ చెల్లి లక్ష్మీ (శివాని) ప్రేమిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథ.

Related Posts

అనంతపురంలో ‘డాకు మహారాజ్’ సక్సెస్ పార్టీ.. ఎప్పుడంటే?

నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా…

తాగిన మత్తులో ‘జైలర్’ విలన్ వీరంగం.. వీడియో వైరల్

‘జైలర్ (Jailer Movie)’ సినిమాలో ‘వర్త్ వర్మా వర్త్’.. అనే డైలాగ్ తో బాగా పాపులర్ అయిన విలన్ వినాయకన్ (Vinayakan). ఈ మలయాళ నటుడు తన విలన్ రోల్స్ తోనే కాదు.. రియల్ లైఫ్ లో పలు వివాదాలతో తరచూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *