–By Charitha
మన ఈనాడు: నవంబర్ 30న తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కు ఉందా లేదా? తెలుసుకుండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఓటర్ ఐడీని తెలుసుకోవచ్చు. electoralsearch.eci.gov.in వెబ్‌సైట్‌లో మీ ఓటును చెక్ చేసుకోండి.
Know Your Voter ID: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వ తేదీన జరుగనుంది. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నా కొద్ది ప్రధాన పార్టీలో టెన్షన్ పెరుగుతోంది. అదే సమయంలో ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ప్రతి ఓటర్‌ను కలిసి పలకరిస్తూ.. “మీ ఓటు మాకే వెయ్యాలి” అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇందుకోసం ఓటర్లు.. ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ అయిన https://electoralsearch.eci.gov.in/ ను ఓపెన్ చేయాలి.
అక్కడ Search in Electoral Roll అనే హోమ్ పేజీ డాష్ బోర్డ్ కనిపిస్తుంది.
అక్కడ కుడివైపున Search by Mobile అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
ఆ తరువాత Select your State ఆప్షన్‌పై క్లిక్ చేసి.. ఓరట్లు తమ రాష్ట్రాన్ని సెలక్ట్ చేసుకోవాలి.
తరువాత తమ భాషను ఎంచుకోవాలి.
కింద మొబైల్ నంబర్ అని ఉన్న చోట ఓటర్లు తమ నంబర్‌ను నమోదు చేయాలి.
ఆ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.. ఓటీపీని ఎంటర్ చేసి, క్యాప్యా కోడ్‌ను ఎంటర్ చేసి, సెర్చ్ కొట్టాలి.
మీ నెంబర్ నమోదైనట్లయితే.. దానిపై ఉన్న ఓటర్ ఐడీ కార్డు నెంబర్, పేరు, రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్ నెంబర్ సహా అన్ని వివరాలు కనిపిస్తాయి.