నీహారికా కొణిదెల.. ఈ అమ్మాయి ఏం చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కొణిదెల ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుందీ అమ్మాయి. తాజాగా నీహారిక పోస్ట్ చేసిన ఓ లవ్ లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Niharika Konidela Love Letter: యాంకర్ గా కెరీర్ మొదలెట్టింది మెగా డాటర్ నీహారిక కొనిదెల. తరువాత ఓ మూడు, నాలుగు సినిమాల్లో చేసింది. తరువాత పెళ్ళి చేసుకుని కొన్నాళ్ళు అన్నింటికీ దూరంగా ఉంది. ఆ పెళ్ళి రెండేళ్ళ ముచ్చటగానే సాగడంతో విడాకులు తీసుకుని మళ్ళీ సింగిల్ లైఫ్ను లీడ్ చేస్తోంది. అయితే ఈ సారి తన సింగిల్ లైఫ్ ను తనకు నచ్చిన పనులు చేసుకుంటూ లీడ్ చేయాలని డిసైడ్ అయింది నిహారిక. దానికి తగ్గట్టుగానే సీరీస్ లు, సినిమాలు చేస్తూ ముందుకు వెళిపోతోంది. తాజాగా దాదాపు 15 మంది కొత్త నటీనటులతో ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభోత్సవానికి నూతన దంపతులు వరుణ్ – లావణ్య (Varun – Lavanya) కూడా హాజరయ్యారు.
ఇక నిహారికా (Niharika Konidela) సోషల్ మీడియాలో కూడా చాలా యాకటివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ పెడుతూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. తాజాగా నీహా పెట్టిన పోస్ట్ ఒక తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఆమె ఒక లవ్ లెటర్ ను పెట్టింది. అది కూడా తన సొంత వాయిస్ తో చదువుతూ. వాయిస్ వెనుక నుంచి వినిపిస్తుంటే వీడియోలు వస్తుంటాయి. ఇందులో తనకు ఇష్టమైన, తన లైఫ్లో ఆడవాళ్ళు అందరితో ఉన్న వీడియోలను పోస్ట్ చేసింది. లవ్ లెటర్ టూ మై ఏంజెల్స్ అని దానికి క్యాప్షన్ ఇచ్చింది. ఇందులో నీహారిక అమ్మ, లావణ్య త్రిపాఠి, శ్రీజ, వితిక, మహాతల్లి, సుస్మిత ఇంకా చాలా మంది ఉన్నారు. వీరందరితో గడిపిన క్షణాలను తాను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ నీహారిక ఎమోషనల్ అయింది.