కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి తన అభిమానాన్ని చాటుకునేందుకు కర్నూలు నుంచి సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన విషయం తెలుసుకున్న చిరంజీవి, ఆమె అంకితభావానికి ముగ్ధులయ్యారు. ఈ భావోద్వేగ సమావేశంలో రాజేశ్వరి చిరంజీవికి రాఖీ(Rakhi) కట్టి, తన ఆత్మీయ బంధాన్ని వ్యక్తం చేశారు.
Megastar Chiranjeevi met fan Rajeshwari, who cycled from Adoni to Hyderabad ❤️
He extended financial aid, gifted a saree & promised education support for her children.
A heart of gold #MegastarChiranjeevi pic.twitter.com/pzHu72VeFr
— idlebrain jeevi (@idlebrainjeevi) August 29, 2025
చీర బహుమానం.. పిల్లల చదువుకు భరోసా
దీనికి స్పందనగా, చిరంజీవి ఆమెకు ఓ చీర(Saree)ను బహుమతిగా ఇచ్చి, ఆమె పిల్లల చదువుకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైన రాజేశ్వరి కన్నీళ్లు పెట్టుకున్నారు. చిరంజీవి ఔదార్యం, ఆప్యాయత ఆమెకు జీవితంలో మరచిపోలేని క్షణంగా మిగిలింది. దీంతో మెగాస్టార్‌కు అభిమానం కేవలం సినిమా స్క్రీన్‌కు పరిమితం కాదని, అది హృదయాలను కలిపే శక్తిగా మారుతుందని ఈ ఘటన నిరూపించిందని ఆయన ఫ్యాన్స్(Mega Fans) ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చిరంజీవి మరోసారి తన సామాజిక స్పృహ, మానవత్వంతో అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడుతున్నారు.






