Border Gavaskar Trophy : హెడ్ 152.. స్మిత్ 101

Mana Endau: భారత్తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో (Border Gavaskar Trophy) ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. టీమిండియాకు తల నొప్పిగా మారిన ట్రావిస్ హెడ్ (Travis Head) మరోసారి విజృంభించాడు. అతడికి తోడు సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ (steve smith) తోడయ్యాడు. ఈ ఇద్దరు సెంచరీలు సాధించడంతో ఆసీస్ స్కోరు బోర్డులో దూసుకెళుతోంది.

వర్షం కారణంగా మొదటి రోజు 13 ఓవర్ల ఆట మాత్రమే జరిగిన విషయం తెలిసిందే. రెండో రోజు 28 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్కు దిగిన ఆసీస్కు (Aussies) మొదట భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(21), నాథన్ మెక్స్వీనీ(9)తోపాటు వన్ డౌన్లో వచ్చిన మార్కస్ లబుషేన్(12) స్వల్ప స్కోర్లకే ఔట్ చేసి పెవిలియన్ చేర్చారు.

కానీ ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన స్టీవ్ స్మిత్ (101), ట్రావిస్ హెడ్ (152) (Travis Head) జోడీని మాత్రం విడదీయలేకపోయారు. వీరు ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా హెడ్ చెలరేగిపోయాడు. ఏకంగా 95 స్ట్రైక్ రేట్తో 160 బంతుల్లో ఏకంగా 152 రన్స్ చేశాడు. ఈ ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 241 పరుగులు జోడించారు. ఈ ఇద్దరిని కూడా బుమ్రా ఔట్ చేసి ఉపశమనం కలిగించాడు.

ఇప్పటివరకు ఆసీస్ 6 వికెట్లు నష్టపోయి 330 పరుగులతో ఉంది. క్రీజులో అలెక్స్ కేరీ (7*), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (1*) క్రీజులో ఉన్నారు. భారత ఆపద్బాంధవుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit bumrah) 5 వికెట్లతో మరోసారి భారత్కు అండగా నిలిచారు. ఒక వికెట్ తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి చిక్కింది. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జడేజాకు వికెట్టేమీ దక్కలేదు.

Related Posts

ఫైనల్లో భారత్‌ X చైనా

డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత మహిళల జట్టు జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి 8.30 గంటలకు జరిగే ఫైనల్లో… జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ మస్కట్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత మహిళల జట్టు జూనియర్‌ ఆసియా…

White House: యూఎస్ ప్రెసిడెంట్ రాయల్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా?

ManaEnadu: ప్రపంచ దేశాలన్నింటికీ అగ్రరాజం అమెరికా(America) ఓ పెద్దన్న. అందుకే అన్ని దేశాలకు ఈ దేశాధ్యుడినే ప్రపంచాధినేతగా అభివర్ణిస్తుంటారు. అంతటి పవర్‌ఫుల్ పదవి యూఎస్ ప్రెసిడెంట్(American President) పోస్ట్. ఈ పదవిలో ఉన్న వారికి సకల సౌకర్యాలతో పాటు ఏ దేశానికి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *