ManaEnadu:పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్(Aruna Kumari Films and presented) బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘6జర్నీ(6 Journey)’. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైన ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. గురువారం ఈ మూవీ టీజర్‌ను పటేల్ రమేష్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో..
పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమా టీజర్‌ను లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. నిర్మాత రవి ప్రకాష్ రెడ్డి, దర్శకుడు బషీర్, సినిమా టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
దర్శకుడు బషీర్ మాట్లాడుతూ.. టేస్టి తేజ ఎనర్జీతో నటించాడని తెలిపారు. సింహ మంచి పాటలు ఇచ్చారన్నారు.
నిర్మాత రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను నిర్మించడం, ఇందులో నటించడం ఆనందంగా ఉందన్నారు.. సినిమా అద్భుతంగా వచ్చిందని, టీజర్ అందరికీ నచ్చేలా ఉందన్నారు.
టేస్టీ తేజ మాట్లాడుతూ.. ‘నన్ను నమ్మి బిగ్ బాస్ షోకి వెళ్లక ముందే ఈ ఆఫర్ వచ్చిందన్నారు. బిగ్ బాస్ నుంచి వచ్చాక కూడా మళ్లీ షూట్‌లో పాల్గొన్నట్లు తెలిపారు.
నటీనటులు:
రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి, అభిరాం, సంజయ్ ఆచార్య, జబర్దస్త్ చిట్టిబాబు, అవంతిక, సోహైల్, సాయి సాగర్, షరీఫ్ ,బాబా కల్లూరి, మిలటరీ ప్రసాద్, సాహితి నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం:
సమర్పణ- పాల్యం శేషమ్మ, బసిరెడ్డి, బ్యానర్ – అరుణ కుమారి ఫిలింస్, నిర్మాత – పాల్యం రవి ప్రకాష్ రెడ్డి, దర్శకత్వం- బసీర్ అలూరి, సినిమాటోగ్రపీ- టి.సురేందర్ రెడ్డి,ఎడిటింగ్ – ఎన్.శ్రీనుబాబు మ్యూజిక్ -ఎం.ఎన్.సింహ,పాటలు – రామారావు మాతుమూరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – రవి కుంచాల, ఎం.గుణ రెడ్డి, కో డైరెక్టర్ అభిరామ్,ప్రొడక్షన్ మేనేజర్ – కోటేష్ బుద్దిరెడ్డి, , పి.ఆర్.ఒ – చంద్ర వట్టికూటి, మోహన్ తుమ్మల ఉన్నారు.






