ManaEnadu:”బాహుబలి” ఫేమ్ కాలకేయ ప్రభాకర్ తెలుగులో హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ప్రభాకర్ ఇప్పుడు కన్నడంలో కూడా హీరోగా మరో సినిమా చేస్తున్నారు.”ఈ సినిమాకు క్లైమాక్స్ ఉండదు”. “అరే.. సినిమాకు అన్నీ ఉంటే కూడా థియేటర్స్ కు జనం వెళ్ళడం లేదు. అలాంటిది క్లైమాక్స్ లేకుండా సినిమా తీస్తే జనం ఒప్పుకుంటారా?” . రెండున్నర గంటల సినిమా చూశాక.. మీరే ఈ సినిమాకు క్లైమాక్స్ సూచించాలని దర్శకుడి అభ్యర్దించారు.”రుద్రాక్షపురం” సినిమా అందించిన ఆర్ కె గాంధీ తాజాగా కన్నడ మరియు తెలుగులో ఏకకాలంలో “ఈ సినిమా కు క్లైమాక్స్ ఉండదు” అనే విచిత్రమైన టైటిల్’తో అంతే విభిన్నమైన స్క్రీన్’ప్లేతో ఈ సినిమాకు శ్రీకారం చుడుతున్నారు!!
స్నేహాలయం క్రియేషన్స్ పతాకంపై నిర్మాణం అవుతున్న ఈ సినిమాకు ప్రమోద్ ఛాయాగ్రహణం, సి.రవిచంద్రన్ సంకలనం, థ్రిల్లర్ మంజు సాహసం, అనిరుద్ శాస్త్రి సంగీతం, ప్రతాప్ భట్ సాహిత్యం, ధీరజ్-అప్పాజి పి.ఆర్.ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కాలకేయ ప్రభాకర్, కావ్య రామ్ జనార్ధన్, రూపశ్రీ, దీన, హరి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఈ నెల 9న ముహూర్తం పెట్టుకొని.. ఆంద్ర – తెలంగాణా మరియు కర్నాటకలోని అందమైన లొకేషన్స్’లో షూటింగ్ జరపడానికి చిత్రబృందం సన్నద్ధం అవుతోంది!!