ప్యూర్​ లవ్​ లవ్​ స్టోరీగా.. “బరాబర్ ప్రేమిస్తా” ..

ManaEnadu:Cc క్రియేషన్స్ పతాకంపై చంద్రహాస్, మేఘన ముఖర్జీ హీరో హీరోయిన్లుగా సంపత్. వి. రుద్ర దర్శకత్వంలో గెడా చందు ,గాయత్రీ చిన్ని, వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్’ బరాబర్ ప్రేమిస్తా'(Barabar Premistha movie). అన్ని హంగులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్​ రివీల్​ చేసింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ”బరాబర్ ప్రేమిస్తా” చిత్రం ప్యూర్ విలేజ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిలుస్తుంది. మా హీరో చంద్రహాస, మేఘనా ముఖర్జీ యూత్ ని ఆకట్టుకునే లవర్స్ గా అద్భుతంగా నటించారు. ఆర్ఆర్ దృవన్ అందించిన సంగీతం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుంది .అలాగే సురేష్ గంగుల మంచి లిరిక్స్ అందించారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుంది. దసరా కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుక రాబోతున్నట్లు యూనిట్​ ప్రకటన చేసింది.

చంద్రహాస్ ,మేఘనముఖర్జీ, అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, రాజశేఖర్ అనింగి , మధు నందన్, అభయ్ నవీన్, మీసాల లక్ష్మణ్, బతిని కీర్తి లత, సునీత మనోహర్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి స్టోరీ: తిరుపతి ఎంఏ, స్క్రీన్ ప్లే: సంపత్. వి . రుద్ర, తిరుపతి,డైలాగ్స్: రమేష్ రాయ్, లిరిక్స్ :సురేష్ గంగుల, ఆర్ట్ : బి .జగన్, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, డిఓపి:వై .ఆర్ శేఖర్, మ్యూజిక్ :ఆర్ .ఆర్. దృవన్, పి ఆర్ ఓ: బి .వీరబాబు, నిర్మాతలు: గెడా చందు, గాయత్రీ చిన్ని , వెంకటేశ్వరరావు ,దర్శకత్వం: సంపత్. వి. రుద్ర.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *