Mana Enadu: సినీ ఇండస్ట్రీ(Cine Industry)లో మరో జంట తమ వివాహ బంధానికి తెరదించింది. ఇటీవల నాగచైతన్య-సమంత(Naga Chaitanya-Samantha) విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తమ 15 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై చెబుతున్నట్లు తమిళ స్టార్ హీరో జయం రవి-ఆర్తి(JayamRavi-Aarthi) తెలిపారు. ఈ మేరకు రవి సోషల్ మీడియాలో అధికారంగా ప్రకటించాడు. గత కొన్ని రోజులుగా రవి తన భార్యతో విడాకులు(Divorce) తీసుకోనున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా అదే విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. అయితే తాము ఒకరికొకరు ఇష్టం, గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవి తెలిపారు. కాగా రవి-ఆర్తికి 2009లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వ్యక్తిగత కారణాలతోనే తాము విడిపోతున్నట్లు రవి చెప్పారు.
అండగా నిలిచిన అభిమానులకు థ్యాంక్స్
‘కష్టకాలంలో తనకు అండగా నిలిచిన అభిమానులకు(Fans) ఈ సందర్భంగా జయం రవి ధన్యవాదాలు. జీవితం ఎన్నో అద్భుతాలు, సవాళ్లతో కూడుకున్నది. అలాగే మా జీవితంలోనూ చాలా మెమొరీస్(Memories) ఉన్నాయి. పైగా ఈ నిర్ణయం మా ఇద్దరికి జీవితానికి ముడిపడిన విషయం. ఇది తొందరపాటు నిర్ణయం కానే కాదు.. బాగా ఆలోచించిన తర్వాతే తీసుకున్న నిర్ణయం. ఇలాంటి సమయంలో జయం రవి విడాకులు అంటూ తమ విడాకుల గురించి ఏవేవో ఊహించుకుని, ఏవేవో కామెంట్స్ చేసి తమని, తమ కుటుంబాన్ని ఇబ్బందిపెట్టవద్దని కోరుకుంటున్నాను’’ అని రవి ఒక సందేశాన్ని ట్విటర్(Twitter) వేదికగా షేర్ చేశారు.
Grateful for your love and understanding.
Jayam Ravi pic.twitter.com/FNRGf6OOo8
— Jayam Ravi (@actor_jayamravi) September 9, 2024
ఆ సినిమాతోనే జయం రవిగా మారాడు..
కాగా.. ఇటీవల పొన్నియన్ సెల్వన్(Ponniyin Selvan) సీక్వెల్స్‌లో నటించిన జయం రవి అంతర్జాయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2002లో టాలీవుడ్(Tollywood)లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న జయం సినిమా తమిళ్ రీమేక్‌లో రవి హీరోగా నటించారు. అప్పటి నుంచి రవి పేరు ముందు జయం చేరిపోయింది. ఆ మూవీ తర్వాత రవికి ఇండస్ట్రీలో ఆఫర్లు వరస కట్టాయి. ఇదిలా ఉండగా.. June 4న జయం రవి, ఆర్తి రవి తమ 15వ పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్నారు. ఆ తరవాతే ఆర్తి తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుంచి తన భర్త జయం రవితో కలిసి తీసుకున్న ఫోటో(Photos)లను డిలీట్ చేశారు. అప్పుడే జయం రవి విడాకుల విషయం తొలిసారిగా బయటికొచ్చింది. తాజాగా అధికారికంగా వారు విడాకులు తీసుకున్నట్లు రవి ప్రకటించాడు.
కరోనా తర్వాత వీరూ విడిపోయారు..
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి, ఆర్తి విడిపోయారు. అయితే కరోనా తర్వాత మరి కొందరు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. అమీర్ ఖాన్ – కిరణ్ రావు, నాగ చైతన్య – సమంత, ధనుశ్ – ఐశ్వర్య, సానియా మీర్జా – షోయబ్ మాలిక్, శిఖర్ ధవన్ – ఆయేషా, హార్దిక్ – నటాషా, నిహారిక – చైతన్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ – ఆలియా సిద్ధిఖీ, హనీ సింగ్ – షాలిని, సోహైల్ ఖాన్ – సీమా సచ్దేవ్, GV ప్రకాశ్- సైంధవి వంటి జంటలు వివిధ కారణాల వల్ల తమ దాంపత్య జీవితానికి వీడ్కోలు పలికారు. వీరిలో కొందరు మరో పెళ్లి చేసుకోగా.. మరికొందరు అలాగే సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.






