ManaEnadu: రానా(Rana Daggubati), దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర హీరో వెంకటేష్ క్లాప్‌నిచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ ‘1950 మద్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది. నాటి సాంఘిక పరిస్థితుల్లో మానవ భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ సాగుతుంది’ అన్నారు.
నటుడిగా పర్‌ఫార్మ్ చేయడానికి ఎంతో స్కోప్ ఉన్న పాత్ర ఇదని దుల్కర్ సల్మాన్ తెలిపారు. పీరియాడిక్ కథాంశంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని రానా పేర్కొన్నారు. సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse )తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: డాని శాంచెజ్ లోపెజ్, సంగీతం: జాను, నిర్మాణ సంస్థ: స్పిరిట్ మీడియా(SpiritMedia), వేఫేరర్ ఫిల్మ్స్, నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్, దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్.
Introducing #KAANTHA, an epic collaboration with my friend @dulQuer !@SpiritMediaIN and @DQsWayfarerFilm brings to you a story that blends artistic storytelling and innovative filmmaking.
Puja completed, can’t wait to start rolling ♥️🔥 pic.twitter.com/U8hZhBEm8u
— Rana Daggubati (@RanaDaggubati) September 9, 2024
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…