‘దేవర’ రోరింగ్ షురూ.. రిలీజ్‌కు ముందే తారక్ మూవీ క్రేజీ రికార్డు

ManaEnadu:ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (NTR). ఆర్ఆర్ఆర్ వంటి సినిమా తర్వాత ఆయన ఎలాంటి మూవీ చేస్తాడా అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల అంచనాకు తగ్గట్టే ఆయన దర్శకుడు కొరటాల శివ (Koratala Shiva) కాంబోలో దేవరకు పచ్చ జెండా ఊపాడు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి నటీనటుల ఎంపిక, హీరోహీరోయిన్ల పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్, టీజర్ వరకు ప్రతి అప్డేట్‌ ఈ చిత్రంపై హైప్ పెంచుతూ వస్తూనే ఉంది. ఇక ఇవాళ రాబోతున్న ట్రైలర్‌పై ప్రేక్షకులకు గంపెడు ఆశలున్నాయి.

అయితే ట్రైలర్ రాకముందే దేవర (Devara Record) ఓ క్రేజీ రికార్డు సృష్టించింది. సినిమా రిలీజ్‌ కూడా కాకముందే ఎన్టీఆర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఓవర్సీస్‌లో ప్రీసేల్‌ టికెట్‌ బుకింగ్స్​లో దేవర చిత్రానికి సంబంధించి వన్‌ మిలియన్‌ టికెట్లు అమ్ముడుపోయాయి. నార్త్‌ అమెరికన్‌ బాక్సాఫీస్‌ వద్ద అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్‌ ద్వారా వన్‌ మిలియన్‌ మార్క్‌ దాటిన సినిమాగా దేవర రికార్డు సృష్టించింది. ట్రైలర్‌ కూడా రిలీజ్ కాకముందే వన్ మిలియన్‌ క్లబ్‌లో చేరిన తొలి భారతీయ చిత్రంగా దేవర ఘనత సాధించింది.

దేవర ట్రైలర్ రిలీజ్‌ అయ్యాక ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని టాక్. అంతే కాదు ఇంకా ఎన్నో రికార్డులు నెలకొల్పే అవకాశముందని సినీ క్రిటిక్స్ అంటున్నారు. అయితే సెప్టెంబరు 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా ఈ చిత్రం రిలీజ్ (Devara Release Date) కాబోతోంది. పక్కా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను ఇవాళ (సెప్టెంబరు 10వతేదీ 2024) రిలీజ్ చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 5.04 గంటలకు దేవర ట్రైలర్​(Devara Trailer) ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దేవరలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది. ఇక విలన్‌గా బీ టౌన్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) నటిస్తున్నాడు. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. ఈ మూవీకి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మించారు.

Share post:

లేటెస్ట్