ManaEnadu:తెలంగాణ ఫిలింఛాంబర్ ఎన్నికలు (telangana film chamber)తాజాగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ప్రతాని రామకృష్ణ గౌడ్(Prathani Ramakrishna Goud)ఎన్నికయ్యారు. ఆయన తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడిగా వరుసగా ఆరోసారి బాధ్యతలు చేపడుతున్నారు. 16 వేల మంది ఈ అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్నారు.
తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – తెలంగాణ ఫిలింఛాంబర్ ఏర్పాటు చేసి 12 ఏళ్లవుతోందన్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆరోసారి వరుసగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని తెలిపారు. నాపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం 24 క్రాప్టుల్లో కలిపి తెలంగాణ ఫిలింఛాంబర్ లో 16వేల మంది ఉన్నారన్నారు.
ఇప్పటివరకు మా అసోసియేషన్ నుంచి 200కు పైచిలుకు సినిమాలు సెన్సార్ అయ్యాయని పేర్కొన్నారు. ఈ ఏడాది 70 సినిమాలు సెన్సార్ చేసినట్లు వెల్లడించారు.
ఉపాధ్యక్షుడు డి. కోటేశ్వరరావు మాట్లాడుతూ – వచ్చే రెండేళ్లలో మంచి కార్యక్రమాలు మా సభ్యుల కోసం చేపట్టబోతున్నామన్నారు. విద్యార్థులకు స్కాలర్ షిప్ లు వంటి వాటి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వివరిస్తామన్నారు.
సెక్రటరీస్ విద్యాసాగర్, కాచం సత్యనారాయణ మాట్లాడుతూ – తెలంగాణ ఫిలింఛాంబర్ కు సెక్రటరీగా ఎన్నికవడం సంతోషంగా ఉందన్నారు. మా అసోసియేషన్ మెంబర్స్ సినిమాలకు సెన్సార్ సమస్యలు వచ్చినప్పుడు వాళ్లతో పాటు వెళ్లి సమస్యలు పరిష్కరించామన్నారు. అలాగే నెంబర్ వన్ అసోసియేషన్ గా తెలంగాణ ఫిలింఛాంబర్ ను భవిష్యత్ లో తీర్చిదిద్దుతాం అన్నారు.
టీ మా ప్రెసిడెంట్ రశ్మి ఠాకూర్ మాట్లాడుతూ – తెలంగాణ ఫిలింఛాంబర్ లో ఏకగ్రీవంగా ఇదే కమిటీని ఎన్నుకోవడం ఇది వరుసగా మూడోసారి. దీంతోనే మా అసోసియేషన్ లో ఎంత ఐక్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. కోవిడ్ టైమ్ లో రామకృష్ణ గౌడ్ గారు ఎంతోమందికి హెల్ప్ చేశారు. ఇకపైనా మా సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా హెల్ప్ చేసేందుకు ఈ కమిటీ సిద్ధంగా ఉంటుంది. అన్నారు.
తెలంగాణ ఫిలింఛాంబర్ ఉపాధ్యక్షులుగా ఏ గురురాజ్, డి.కోటేశ్వరరావు, జి. వరప్రసాద్ ఎన్నికయ్యారు.జనరల్ సెక్రెటరీస్ గా జె.వి.ఆర్, విద్యాసాగర్, కాచం సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రెటరీస్ గా పినిశెట్టి అశోక్ కుమార్, పి. వరప్రసాద్ రావ్, వై.శ్రీనివాసరావులు ఉన్నారు.