OTT Releases: సినీ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఈవారం ఓటీటీలోకి 4 కొత్తసినిమాలు

ManaEnadu: ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి ఈవారం ఇంట్రెస్టింగ్ 4 సినిమాలు అడుగుపెట్టనున్నాయి. ఓటీటీల్లో తెలుగు చిత్రాలు చూడాలనుకునే వారికి పాపులర్ సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో రవితేజ మూవీ మిస్టర్ బచ్చన్ కూడా ఉంది. అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్‍లు అయిన మరో రెండు చిత్రాలు.. అలాగే ఓ సినిమా నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది. ఇలా ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే నాలుగు తెలుగు సినిమాలు ఏంటో తెలుసుకుందామా..

 కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu)
కమిటీ కుర్రోళ్ళు తక్కువ బడ్జెట్ చిత్రంగా వచ్చిన మంచి హిట్టు కొట్టింది. మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) ప్రొడ్యూస్ చేసిన తొలి మూవీతోనే సక్సెస్ సాధించారు. ఈ చిత్రం ఆగస్టు 9న థియేటర్లలో రిలీజైంది. మొదటి నుంచి పాజిటివ్ టాక్‍తో దూసుకెళుతోంది. యధు వంశీ(Yadu Vamshi) దర్శకత్వం వహించిన ఈ రూరల్ కామెడీ డ్రామా చిత్రంలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ సహా మరికొందరు లీడ్ రోల్స్ చేశారు. కమిటీ కుర్రోళ్ళు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్(Etv Win) ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.

 ఆయ్ (Aay)
ఆయ్ మూవీ అంచనాలకు మించి సూపర్ హిట్ అయింది. నార్నే నితిన్(Narne Nitin) హీరోగా నటించిన ఈ రూరల్ కామెడీ మూవీ రూ.15 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించింది. ఈ చిత్రంలో నితిన్ సరసన నయన్ సారిక(Nayan Sarika) హీరోయిన్‍గా నటించారు. ఆయ్ చిత్రానికి అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించగా.. జీఏ2 పిక్చర్స్ పతాకం నిర్మించింది. ఈ సినిమా డిజిటిల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకుంది. వచ్చే నెల సెప్టెంబర్ 12నుంచి నెట్‍ఫ్లిక్స్‌లో అలరించనుంది.

 మిస్టర్ బచ్చన్ (Mr Bacchan)
ఎన్నో అంచనాలతో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. మాస్ మహారాజ్ రవితేజ(RaviTeja) హీరోగా నటించిన ఈ మూవీ ఆగస్టు 15న ఆడియన్స్ ముందుకు వచ్చింది. హరీశ్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రీమియర్ షోల నుంచే మిక్స్డ్ టాక్‍తో చతికిలపడింది. కాగా మిస్టర్ బచ్చన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకుంది. రూ.33కోట్లకు ఈ మూవీ హక్కులను తీసుకున్నట్టు సమాచారం. సెప్టెంబర్‌ 12న స్ట్రీమింగ్‍కు సిద్ధమైంది. ఈ మూవీలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే(Bhagyasri Borse) హీరోయిన్‍గా నటించింది.

బాలుగాని టాకీస్(Balugani Talkis)
బాలుగాని టాకీస్(Balugani Talkis) చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా AHA OTT ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమా ఆహాలో అడుగుపెట్టనుంది. ఈ చిత్రంలో శివ రామచంద్రవరపు, శరణ్య శర్మ, రఘు కుంచె ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్ నడుపుకునే యువకుడు ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. బాలుగాని టాకీస్ మూవీలో హీరోగా బాలకృష్ణ అభిమానిగా ఉంటారు. చిన్న కథాంశంతో వచ్చిన ఈ మూవీ ఓటీటీలో దుమ్ములేపేందుకు సిద్ధమైంది.

Share post:

లేటెస్ట్