‘మత్తు వదలరా-2’ టు ‘మిస్టర్ బచ్చన్’.. ఈ వారం థియేటర్/ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే

ManaEnadu:సెప్టెంబరు రెండో వారం వచ్చేసింది. గత వారం ది గోట్ (The GOAT), 35 చిన్న కథ కాదు వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక థియేటర్లలో నాని సరిపోదా శనివారం ఇంకా ఆడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ వారం థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు మరికొన్ని చిత్రాలు రెడీగా ఉన్నాయి. అందులో అందరి కళ్లు మత్తు వదలరా-2 సినిమాపైనే ఉన్నాయి. మత్తు వదలరా అంటూ గతంలో వచ్చిన సినిమా ప్రేక్షకులను విపరీతంగా అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్​తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు ఓటీటీలోనూ పలు సినిమాలు, వెబ్ సిరీస్​లు అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి అవేంటో చూద్దామా?

థియేటర్​లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

మలయాళ అనువాద చిత్రం ‘మిన్నల్‌ మురళి’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో టొవినో థామస్‌ (TovinoThomas) నటిస్తున్న పాన్‌ ఇండియా సినిమా ‘ఎ.ఆర్‌.ఎం’ (ARM Movie). జితిన్‌ లాల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ నెల 12న (ARM Movie Release Date) తెలుగులో రిలీజ్ చేస్తోంది. కృతిశెట్టి, ఐశ్వర్య రాజేశ్‌, బసిల్‌ జెసెఫ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఎం.ఎం. కీరవాణి చిన్న తనయుడు శ్రీసింహా కోడూరి, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). రితేశ్‌ రానా తెరకెక్కించిన ఈ సినిమా వీరు రూపొందించిన సక్సెస్​ఫుల్ మూవీ ‘మత్తు వదలరా’కు సీక్వెల్‌. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించిన ఈ సినిమా సెప్టెంబరు 13న (mathu vadalara 2 release) రిలీజ్ అవుతోంది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వరుసగా మూడో నెల ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్​కు వస్తున్నాడు యంగ్ హీరో రాజ్‌తరుణ్‌. దర్శకుడు మారుతి సమర్పణలో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘భలే ఉన్నాడే’ (Bhale Unnade). జె.శివసాయి వర్ధన్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఈనెల 13న రిలీజ్ అవుతోంది.

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు ఇవే

నెట్‌ఫ్లిక్స్‌

ఛాంపియన్స్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 10
మిస్టర్‌ బచ్చన్‌ (తెలుగు) సెప్టెంబరు 12
ఆయ్‌ (తెలుగు) సెప్టెంబరు 12
ఎమిలి ఇన్‌ పారిస్‌ (వెబ్‌సిరీస్‌)  సెప్టెంబరు 12
సెక్టార్‌36  (హిందీ) సెప్టెంబరు 12
ఇన్‌టు ది ఫైర్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 12
అగ్లీస్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 13
ఆడిషన్‌ ప్రాజెక్ట్‌ (డాక్యుమెంటరీ) సెప్టెంబరు 13
ఆఫీసర్‌ బ్లాక్‌ బెల్ట్ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 13
గిఫ్టెడ్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 15

జీ5

బెర్లిస్‌ (హిందీ) సెప్టెంబరు 13
రఘు తాత (తెలుగు) సెప్టెంబరు 13
నునాకుజి (తెలుగు) సెప్టెంబరు 13

డిస్నీ+హాట్‌స్టార్‌

ది ఛావెజ్‌ (స్పానిష్‌) సెప్టెంబరు 11
రీబిల్ట్‌ ది గ్యాలక్సీ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 13
గోలీసోడా (తమిళ్‌) సెప్టెంబరు 13
సియోల్‌ బస్టర్స్‌ (కొరియన్‌) సెప్టెంబరు 13

సోనీలివ్‌

తలవన్‌ సెప్టెంబరు 10

Related Posts

Edgbaston Test: శెభాష్ శుభ్‌మన్.. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో డబుల్ సెంచరీ

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌(Edgbaston, Birmingham) లో జరుగుతున్న ఇంగ్లండ్‌(England)తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) సూపర్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. రెండో రోజు టీ విరామం(Tea Break) వరకు 265 నాటౌట్‌తో అజేయంగా నిలిచిన గిల్,…

Kubera: కుబేరలోని పిప్పీ పిప్పీ డమ్ డమ్ డమ్’ ఫుల్ వీడియో సాంగ్‌ రిలీజ్..

శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’(Kubera) ఈ నెల 20న విడుదలై సూపర్ హిట్​ టాక్​ తెచ్చుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ (Dhanush), కింగ్ నాగార్జున (Nagarjuna), పాన్ ఇండియా బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika) కీలక పాత్రల్లో నటించారు. తాజాగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *