Devara Trailer : ‘రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ’.. ఊర మాస్ అవతార్​లో తారక్

ManaEnadu:ఆర్ఆర్ఆర్ (RRR) వంటి గ్లోబల్ హిట్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్​ ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న చిత్రం దేవర. జనతా గ్యారేజ్ (Janatha Garage) తర్వాత కొరటాల శివ (Koratala Shiva)-ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు విపరీతంగా అంచనాలున్నాయి. ఒక్కో అప్డేట్​తో ఆ అంచనాలను మేకర్స్ పెంచుతూ వస్తున్నారు. ఇప్పటికే పోస్టర్స్, గ్లింప్స్, లిరికల్ సాంగ్స్, టీజర్​తో హైప్​ను అమాంతం పెంచేసిన మేకర్స్.. ఇప్పుడు ట్రైలర్​తో మరో మాస్ అప్డేట్​ను ఇచ్చారు. సెప్టెంబరు 27వ తేదీన వరల్డ్ వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కానున్న దేవర ట్రైలర్(Devara Trailer)​ను ఇవాళ (సెప్టెంబరు 10వ తేదీ) విడుదల చేశారు.

‘కులం లేదు మతం లేదు.. భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్లలో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. సానా పెద్ద కథ సామి. రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ. మా దేవర కథ అంటూ ఎన్టీఆర్​ క్యారెక్టర్​ను ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో ఇంట్రడ్యూస్ చేసిన డైలాగ్​తో ఈ ట్రైలర్ మొదలైంది. మనిషికి బతికేంత భయం చాలు. చంపేంత ధైర్యం కాదు. కాదూ కూడదు అంటూ ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.

“పనిమీద పోయినోడైతే పనవ్వంగానే తిరిగొస్తాడు. పంతం పట్టి పోయిండు నీ కొడుకు. భయం మరిచి తప్పుడు పనికోసం ఎప్పుడైనా సంద్రం ఎక్కితే.. ఈరోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉండ” అంటూ ఎన్టీఆర్ డైలాగ్స్ ఈ ట్రైలర్​లో ఆకట్టుకున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఇందులో ఎన్టీఆర్ తండ్రీకొడుకుల పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక ట్రైలర్​ జాన్వీ చాలా అందంగా కనిపించింది.

మరోవైపు ఈ సినిమా రిలీజ్​కు ముందే ఓ క్రేజీ రికార్డు క్రియేట్ చేసింది. ఓవర్సీస్‌లో ఈ మూవీ ప్రీసేల్‌ టికెట్‌ బుకింగ్స్​ (Devara Pre Bookings)లో వన్‌ మిలియన్‌ సేల్ చేసి నార్త్‌ అమెరికన్‌ బాక్సాఫీస్‌ వద్ద అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్‌ ద్వారా వన్‌ మిలియన్‌ మార్క్‌ దాటిన సినిమాగా రికార్డుకెక్కింది. ట్రైలర్‌ కూడా రిలీజ్ అవ్వకముందే ప్రతిష్టాత్మక వన్ మిలియన్‌ క్లబ్‌లో చేరిన తొలి భారతీయ చిత్రం ఈ సినిమా ఘనత సాధించింది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్‌ కావడంతో ఈ సంఖ్య మరింత పెరిగి మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేఅవకాశముందని సినీ క్రిటిక్స్ అంటున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్​కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ () నటిస్తోంది. ఇక తారక్​ను ఢీకొట్టే విలన్ పాత్రలో బీ టౌన్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్​లో కనిపించనున్నారట. యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎన్​టీఆర్ అన్నయ్య నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మించారు. సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా మరో 17 రోజుల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది.

Share post:

లేటెస్ట్