Ramayanam: ‘రామాయణ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల.. భారీ ఈవెంట్‌తో అభిమానులకు ట్రీట్

నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న బాలీవుడ్ భారీ చిత్రం ‘రామాయణ(Ramayana)’ నుంచి ఎట్టకేలకు ఫస్ట్ గ్లింప్స్(First Glimpse) విడుదలైంది. ఈ రోజు (జులై 3) ఉదయం 11:30 గంటలకు దేశవ్యాప్తంగా 9 నగరాల్లో ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ (PVX)తో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, కోల్‌కత్తా, పూణే, కొచ్చిలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రణ్‌బీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత), యశ్ (రావణుడు), సన్నీ డియోల్ (హనుమంతుడు), కాజల్ అగర్వాల్ (మండోదరి), లారా దత్తా (కైకేయి), రకుల్ ప్రీత్ సింగ్ (శూర్పణఖ) నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఏ.ఆర్. రెహమాన్, హన్స్ జిమ్మెర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో పూర్తయింది. నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాణంలో, IMAXలో చిత్రీకరించబడుతున్న ఈ ఎపిక్ ఇతిహాసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *