ManaEnadu:చాలా మంది అమ్మాయిలు చిన్న పనిమీద బయటకు వెళ్లినా ముఖానికి మేకప్ (Make Up) వేసుకుని అందంగా రెడీ అయి బయల్దేరతారు. ఇంకా ఏదైనా ఫంక్షన్, ఈవెంట్, స్పెషల్ అకేషన్స్ ఉంటే మరింత అందంగా తయారవుతారు. కళ్లకు కాటుక (Kajal), మస్కారా, ఐలైనర్ (Eye Liner), పెదవులకు లిప్‌స్టిక్ ఇలా మేకప్ చేసుకుని బుట్టబొమ్మల్లా రెడీ అయి బయటకు వెళ్తుంటారు. అయితే సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అలసిపోతారు.
అలా చాలా మంది అలసిపోయి మేకప్ తీయకుండానే నిద్రపోతారు. కనీసం ముఖం కూడా కడుక్కోకుండా బెడ్ ఎక్కేస్తారు. అలా మేకప్ తొలగించకుండా నిద్రపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయట. అంతే కాదండోయ్ మీ చర్మం పాడైపోతుందట కూడా. మరి మేకప్ తీయకుండా నిద్రపోతే వచ్చే నష్టాలు ఏంటి? మేకప్ ఎలా తొలగించాలో తెలుసుకుందామా?
⦁ మొదట అమ్మాయిలు కళ్లు అందంగా కనిపించేందుకు ఐలైనర్, మస్కారా వంటివి వాడతారు. ఇవి కళ్ల అందాన్ని డబుల్ చేస్తాయి. కానీ రాత్రి పడుకునే ముందు వీటిని కచ్చితంగా తీసేయాలి.
⦁ వీటిని తొలగించకపోతే కళ్ల నుంచి నీరు కారడం, కళ్లు ఎర్రగా మారడం జరుగుతాయి. అలాగే కళ్లు దురగ పెడతాయి కూడా. అందుకే ఐ మేకప్ రిమూవర్‌తో వీటిని తొలగించి చల్లటి నీళ్లతో కళ్లను శుభ్రంగా కడిగేయాలి.
⦁ ఇక పెదవులు మరింత అందంగా గులాబీ రంగులో కనిపించాలని చాలా మంది అమ్మాయిలు రకరకాల రంగుల్లో ఉండే లిప్‌స్టిక్ (Lipstick)లు వాడుతుంటారు.
⦁ అయితే లిప్‌స్టిక్‌ను ఎక్కువ సేపు ఉంచుకున్నా, తొలగించకుండా అలాగే వదిలేసినా.. పెదవులపై ఉండే తేమను పీల్చుకుని పెదాలు పొడిబారేలా చేస్తాయట.
⦁ ఫలితంగా పెదవులపై పగుళ్లు ఏర్పడతాయి. అందుకే పడుకునే ముందు లిప్‌స్టిక్‌ను పూర్తి తీసేసి పెదవులను మంచినీటితో కడుక్కోవాలి.
⦁ ఇక ముఖంపై ఉన్న మేకప్‌ని తొలగించుకోకుండా నిద్రపోతే అనేక చర్మ సమస్యలు వస్తాయి. ముఖంపై మేకప్‌ను తొలగించకుండా అలాగే ఉంచితే చర్మం పొడిబారి పోతుందని నిపుణులు చెబుతున్నారు.
⦁ వ్యర్థాలతో చర్మ రంధ్రాలు (Skin) మూసుకుపోతాయని.. వయసు మళ్లిన తర్వాత రావాల్సిన ముడుతలు ముందే వస్తాయంటున్నారు. అందుకేపడుకునే ముందు మేకప్‌ను తొలగించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు.
Bonala Jathara 2055: భాగ్యనగరంలో బోనాల జాతర షురూ.. నేడు జగదాంబిక ఎల్లమ్మకు తొలిబోనం
ఆషాఢ మాసం బోనాలు(Bonalu) నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రక గోల్కొండ కోట(Golconda Kota)పై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ(Jagadambika Yellamma) ఆలయంలో జరిగే తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభం కానుంది. ‘డిల్లం.. బల్లెం.. కుడకలు బెల్లం’ అంటూ ఆదిపరాశక్తి…








