Mana Enadu: పెళ్లంటే(Wedding) నూరేళ్ల పంట.. పెళ్లంటే.. జీవితంలో ఒకసారి జరిగే ఓ మధుర ఘట్టం. ఓ కొత్త జీవితానికి(New Life) ఏడు అడుగుల శుభతరుణం. గతంలో పెళ్లిళ్లు ఐదారు రోజులపాటు జరిగేవి. పెళ్లికి ముందు వారం, పదిరోజుల ముందే బంధువులంతా వచ్చేవారు. అయితే ప్రస్తుతం ట్రెండ్(Trending) మారింది. పెళ్లి సంగతి అటుంచితే.. సరిగ్గా భోజనం టైమ్‌కి వచ్చామా.. తిన్నామా కట్నకానులు(Gifts) చదివించి వెళ్లామా అన్న చందంగా మారింది పరిస్థితి. సాధారణంగా ఎక్కడైనా పెళ్లిళ్లు ఎలా జరుగుతాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భారతదేశం(India)లో చాలా మంది పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు. మరికొందరు లవ్ మ్యారేజ్(Love Marriage) చేసుకుంటారు. కానీ, ఈ ప్రపంచంలో ఇలా కాకుండా వింతైన పెళ్లిళ్లు (Strangest weddings) కూడా చాలానే జరిగాయి. మరి అవేంటో ఒకసారి చూసేద్దామా..
మరో యువతిని పెళ్లాడిన ఇంగ్లండ్ క్రికెటర్
తాజాగా ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్(Daniel Wyatt) తన ప్రియురాలు జార్జియా హోడ్జ్(Georgia Hodge)ను పెళ్లి చేసుకున్నారు. ఈ నెల 22న వీరి పెళ్లి ఫ్రాన్స్(France)లో జరగగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. గతేడాది మార్చిలో వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కాగా వ్యాట్ ఇంగ్లండ్(England) తరఫున 160 ODIలు, 112 T20లు, 2 టెస్టులు ఆడారు. ఇలాగే ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి.
తనను తానే పెళ్లి చేసుకున్నాడు
చైనా(Chaina)కు చెందిన లియు యే(Liu Ye) అనే వ్యక్తి తనను తానే పెళ్లి చేసుకున్నాడు. తనకన్నాఎవరూ అందంగా ఉండరని భావించి.. ఒక కార్టు బోర్డుపై తన చిత్రాన్ని ఆడవేషంలో తయారుచేయించి మరి దాన్ని పెళ్లి చేసుకున్నాడు. విచిత్రమేంటంటే.. ఆ వివాహ వేడుకకు అతిథులను కూడా ఆహ్వానించారట. అచ్చం పెళ్లి వేడుకకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు, ఆహార వంటలూ తయారు చేపించి అతిథులకు వడ్డించాడు.
తల దిండుతో వివాహం
లీ జిన్-గ్యు(Lee Jin-gyu) అనే కొరియన్(Korean) వ్యక్తి తన తల దిండును అందంగా అలంకరించి దాన్ని వివాహం చేసుకున్నాడు. పైగా దానికి నామకరణం కూడా చేసి.. తను నా గర్ల్‌ఫ్రెండ్(Girlfriend) అందుకే పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పాడు. అతను రెస్టారెంట్లు, రైడ్‌లకు వెళ్లినా ఆ దిండును తనతో పాటే తీసుకెళ్తాడట. అందుకే తాను ఎంతో ఇష్టపడే దిండునే పెళ్లి చేసుకున్నట్లు జిన్ తెలిపాడు. ఈ వింత పెళ్లిపై కొరియన్లే కాదు ఈ విషయం తెలిసిన వారంతా అవాక్కయ్యారు.
మేకతో పెళ్లి
మన దేశంలోనూ కొన్ని వింత ఆచారాలు ఉన్నాయి. జాతక దోషం ఆధారంగా APలోని నూజివీడుకు చెందిన ఓ యువకుడు మేకను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆయన జాతకంలో రెండు పెళ్లిళ్లు జరుగుతాయని తేలడంతో దోష నివారణ కోసం ఈ వివాహ తంతు నిర్వహించారు. దీని కోసం ఆయన ఆ మేక మెడలో మూడు ముళ్లు వేయాల్సి వచ్చిందట. అలాగే సూడాన్(Sudan)కి చెందిన మరో వ్యక్తి కూడా ఓ తప్పు చేయడం వల్ల, అక్కడి నిబంధనల మేరకు మేక(Goat)ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.
పాముతో వివాహం
మన దేశంలోనే ఒడిశా రాష్ట్రానికి చెందిన బిమ్ బాలా(Bim Bala) అనే మహిళ నివసిస్తున్న ఇంట్లో ఓ పుట్ట, అందులో ఓ పాము(Snake) ఉండేది. అది పుట్టలో నుంచి బయటకి వచ్చిన ప్రతిసారి బిమ్ బాలా పాలు అందించేది. ఈ క్రమంలోనే ఆమె ఆ పాముని ప్రేమించిందట. ఆ సర్పాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇంట్లోవాళ్లు కూడా ఒప్పుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులూ అంగీకరించారు. పుణ్యం వస్తుందని దాదాపు 2వేల మంది ఈ పెళ్లికి హాజరయ్యారు. కానీ ముహూర్తం సమయంలో పాము పుట్టలో నుంచి బయటకు రాకపోవడంతో బిమ్ బాలా ఇత్తడితో తయారుచేసిన పాము బొమ్మను వివాహమాడింది.