Vegetarians : శాకాహారులు ఎక్కువగా ఉన్న టాప్-5 దేశాలివే

Mana Enadu : చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కొందరికైతే బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్.. ఇలా ప్రతిదాంట్లోనూ నాన్వెజ్ (Non Veg) ఉండాల్సిందే. అయితే పుట్టుక నుంచి హార్డ్ కోర్ నాన్వెజిటేరియన్స్ అయిన కొందరు ఈ మధ్య రూట్ మారుస్తున్నారు. ముక్క లేకపోతే ముద్ద దిగని పరిస్థితుల నుంచి అసలు మాంసం అంటేనే నో..నో..నో.. అని దూరం పెట్టే పరిస్థితికి వచ్చారు.

ముఖ్యంగా కరోనా (Corona Pandemic) లాకౌడ్న్ తర్వాత చాలా మంది జీవనశైలి మారిపోయింది. మాంసాహారులంతా శాకాహారులుగా మారిపోయారు. ఇంకొందరైతే ఇంకో మెట్టు ఎక్కి వీగన్స్గా మారిపోతున్నారు. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వెజిటేరియన్స్ (Vegetarians) పెరిగిపోతున్నారు. లైఫ్ స్టైల్ (Life Style), ఆరోగ్య సమస్యల కారణంగా చాలా మంది శాకాహారాన్ని ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో శాకాహారులు ఎక్కువగా ఉన్న టాప్ 5 దేశాలు ఏవో ఓసారి తెలుసుకుందామా?

భారతదేశం (INDIA): శాకాహారులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశానికి మొదటి స్థానం. ఇక్కడున్న జనాభాలో 30 శాతం మందికి పైగా ప్రజలు వెజిటేరియన్స్ అని పలు అధ్యయనాలు తెలుపుతున్నారు. ముఖ్యంగా హర్యానా, రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రాల్లో శాకాహారులు ఎక్కువగా ఉన్నారట.

ఇజ్రాయెల్ (Israel): ఇండియాకు మిత్రదేశమైన ఇజ్రాయెల్ జనాభాలో 13 శాతం మంది వెజిటేరియన్సేనట. అయితే మన ఆకలి తీర్చుకోవడానికి మరో ప్రాణి ప్రాణం తీయడం సమంజసం కాదని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారట.

తైవాన్ (Taiwan): వెజ్ ఫుడ్ను ఇష్టంగా తినే జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో తైవాన్ కూడా ఒకటి. ఇక్కడి జనాభాలో 12 శాతం మంది వెజిటేరియన్స్ ఉన్నారు. ఇక ఇక్కడ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ల శాతం కూడా ఎక్కువేనట.

ఇటలీ (Italy) : ఈ దేశ జనాభాలో సుమారు 10 శాతం మంది ప్రజలు శాకాహారులట. సాధారణంగా ఇటలీ నాన్వెజ్కు పేరుగాంచింది. ఇటాలియన్ ఫుడ్ వరల్డ్ ఫేమస్ అన్న విషయం తెలిసిందే. అయినా ఆరోగ్య సమస్యలు, జీవనశైలిలో మార్పులు వంటి కారణాలతో ఇక్కడ వెజిటేరియన్స్ సంఖ్య పెరిగిపోతోందని తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి.

ఆస్ట్రియా (Austria) : ప్రపంచ వ్యాప్తంగా శాకాహార ఆహారాన్ని అనుసరించే దేశాల్లో ఆస్ట్రియా టాప్-5లో ఉంది. ఇక్కడి జనాభాలో 9 శాతం మంది వెజ్ ఆహారాన్నే ఇష్టంగా తింటున్నారట.

Share post:

లేటెస్ట్