Saripodhaa Sanivaaram : సరిపోయిందిగా.. రూ.100 కోట్ల క్లబ్ లో నాని మూవీ

Mana Enadu: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani) హ్యాట్రిక్ కొట్టేశాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం ఇలా వరుస హిట్లతో జోరు మీదున్నాడు. ఇక నాని చిత్రాల్లో దసరా (Dasara) మూవీ రూ.వంద కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ‘సరిపోదా శనివారం’ రూ .100 కోట్ల క్లబ్లో చేరింది.

ఆగస్టు 29వ తేదీన విడుదలైన ఈ సినిమా (Saripodhaa Sanivaaram) బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రూ. 100 కోట్ల మార్క్ అందుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘బాక్సాఫీస్ శివ తాండవమే’ అంటూ సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేశారు. ‘ఇప్పుడు సరిపోయింది. మీకు (ప్రేక్షకులు) థ్యాంక్స్ చెప్పము. మీరంతా ఓ ఫ్యామిలీలాగా ఆదరించి, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందించారు. ఫైనల్లీ.. పోయారు మొత్తం పోయారు’ అని మేకర్స్ ఈ పోస్టు కింద క్యాప్షన్ రాసుకొచ్చారు.

ఈ సినిమాలో సీనియర్ నటుడు ఎస్జే సూర్య (SJ Surya0 కీలక పాక్ర పోషించిన విషయం తెలిసిందే. ‘నన్నడుగుతాడేంటీ సుధా వీడు’ అంటూ సూర్య చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. హీరో పాత్రకు దీటుగా చెప్పాలంటే నాని పాత్రను డామినేట్ చేసేలా ఎస్జే సూర్య క్యారెక్టర్, పర్ఫామెన్స్ అదిరిపోయింది. నాని- సూర్య మధ్య యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్గా నిలిచాయి. ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka M ohan) హీరోయిన్గా నటించింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమా రూపొందించారు.

ఇక నాని ఈ సినిమా జోష్లో తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. తన సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాలో తెరకెక్కుతున్న హిట్- ది థర్డ్ కేసు (HIT : The Third Case)లో నాని నటిస్తున్నాడు. శైలేశ్‌ కొలను డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో నాని పాత్రను ఇటీవలే పరిచయం చేశారు. సర్కార్ టేక్స్ ఛార్జ్ అంటూ ఓ గ్లింప్స్ వదిలారు. ఈ క్రైమ్‌ థ్రిల్లర్లో నాని అర్జున్‌ సర్కార్‌ అనే ఓ పవర్ఫుల్ ఐపీఎస్‌ ఆఫీసర్గా కనిపించనున్నాడు. 2025 మే 1న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కానుంది.

Share post:

లేటెస్ట్