వివాహ బంధంతో ఒక్కటైన సిద్ధార్థ్‌-అదితి.. ఫొటోలు వైరల్

ManaEnadu:ప్రముఖ నటుడు సిద్ధార్థ్, నటి అదితీ రావు హైదరీ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జంట ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఒక్కటైంది. తెలంగాణలోని వనపర్తిలోని దేవాలయంలో వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఈ జంట సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. క్యూట్ కపుల్, పవర్ కపుల్, బ్యూటీఫుల్ కపుల్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. హ్యాపీ మ్యారిడ్ లైఫ్ అంటూ విషెస్ చెబుతున్నారు. 

సిద్దార్థ్, అదితీ పెళ్లి ఫోటోలు.. ఎంత ముచ్చటగా ఉన్నారో

గత కొంతకాలంగా ఈ జంట ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే వనపర్తి ఆలయంలోనే ఈ జంట సీక్రెట్​గా నిశ్చితార్థం చేసుకుంది. అప్పుడే వీరి పెళ్లి జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎంగేజ్​మెంట్ చేసుకున్నట్లు ఈ జంట సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. త్వరలోనే వివాహ డేట్ చెబుతామని తెలిపింది. ఇప్పుడు సడెన్​గా ఈ జంట అతికొద్ది మంది అతిథుల సమక్షంలో దైవసాక్షిగా ఒక్కటైంది. అదితీరావు హైదరీ వనపర్తి సంస్థానానికి యువరాణి అన్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతంతో ఆమెకు చాలా అనుబంధం ఉంది. అందుకే తనకు ఎంతో ఇష్టమైన ప్రాంతంలో తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది ఈ కొత్త జంట.

సిద్దార్థ్, అదితీ పెళ్లి ఫోటోలు.. ఎంత ముచ్చటగా ఉన్నారో

ఈ ఫొటోలను షేర్ చేసిన అదితి.. ‘‘నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. అలాగే నువ్వే నా తారాలోకం. మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ అదు సిద్ధు’’ అని క్యాప్షన్‌ జత చేసింది. ఇక సిద్ధార్థ్‌తో తన రిలేషన్‌ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మహా సముద్రం’ షూట్‌లో తమ మధ్య పరిచయం ఏర్పడిందని తెలిపింది కొంతకాలానికి అది స్నేహంగా మారిందని, తనకెంతో ఇష్టమైన ప్రదేశంలో సిద్ధార్థ్‌ తనకు ప్రపోజ్‌ చేశాడని చెప్పింది.

సిద్దార్థ్, అదితీ పెళ్లి ఫోటోలు.. ఎంత ముచ్చటగా ఉన్నారో

“హైదరాబాద్‌లో తన నానమ్మ ప్రారంభించిన స్కూల్ అంటే తనకెంతో ప్రత్యేకమని.. ఆ విషయం తెలుసుకున్న సిద్ధార్థ్ ఆ స్కూల్​కు తనను తీసుకెళ్లమని అడిగాడు. ఈ ఏడాది మార్చిలో మేమిద్దం ఆ స్కూల్​కు వెళ్లాం. అప్పుడు సడెన్​గా సిద్ధు.. మోకాళ్లపై కూర్చొని.. అతను నాకు ప్రపోజ్‌ చేశాడు. ఆమె ఆశీస్సుల కోసమే తాను అక్కడ ప్రపోజ్‌ చేసినట్లు చెప్పాడు’’ అని అదితి తమ ప్రేమ ముచ్చట్లు చెప్పుకొచ్చింది.

 

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *