ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించనున్న సినిమాలు ఇవే

Mana Enadu : సెప్టెంబరు మూడో వారం వచ్చేసింది. గత వారం దళపతి విజయ్ నటించిన ది గోట్ (The GOAT), నివేదా థామస్ 35 చిన్న కథ కాదు వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. ఓ చిన్న సినిమా, మరో రెండు రీ రిలీజ్​లు ఈ వారం విడుదలకు రెడీగా ఉన్నాయి. వచ్చే వారం ఎన్టీఆర్ దేవర (Devara రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ వారం చిన్న చిత్రాలు, రీ-రిలీజ్‌మూవీలు మాత్రమే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీ (OTT Movies)లోనూ మిమ్మల్ని అలరించేందుకు సినిమాలు, వెబ్ సిరీస్​లు సిద్ధమయ్యాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దామా?

థియేటర్​లో రిలీజ్ అయ్యే సినిమాలు

  • డిఫరెంట్ కాన్సెప్టులతో ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ నటుడు సుహాస్ (Suhas). ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘గొర్రె పురాణం (Gorre Puranam Movie)’. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక ఊరిలో రెండు వర్గాల మధ్య ఒక గొర్రె ఎలా చిచ్చు పెట్టింది? అనే ఆసక్తికర కథతో ఈ సినిమా రూపొందినట్లు సమాచారం.
  • రీ రిలీజ్​ల హవా నడుస్తున్న తరుణంలో తాజాగా సిద్ధార్థ్, జెనీలియా (Genilia) జంటగా నటించిన సినిమా ‘బొమ్మరిల్లు (Bommarillu) రీ రిలీజ్​కు రెడీ అవుతోంది. భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2006లో విడుదల బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్లీ థియేటర్స్‌లో సందడి చేసేందుకు సెప్టెంబరు 21న తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్స్‌లో ‘బొమ్మరిల్లు’ (Bommarillu re release) విడుదలకు సిద్ధమైంది.
  • తమిళ, తెలుగు భాషల్లో విజయాన్ని అందుకున్న సినిమా ‘జర్నీ’ (Journey Movie) కూడా రీ రిలీజ్​కు సిద్ధమైంది.  జై, శర్వానంద్‌, అంజలి అనన్య కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ సెప్టెంబరు 21న ‘జర్నీ’ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.
  • ‘మీమీ’, ‘జర హట్కే జర బచ్కే’  వంటి సినిమాలతో అలరించిన డైరెక్టర్ లక్ష్మణ్‌ ఉటేకర్‌ అందించిన కథతో, శౌరబ్‌ దాస్‌గుప్త దర్శకత్వంలో వస్తున్న సినిమా  ‘కహా షురూ.. కహా ఖతం (Kahan Shuru Kahan Khatam)’ . ధ్వని భానుశాలి, ఆషిమ్‌ గులాటీ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా సెప్టెంబరు 20న ఈ మూవీ హిందీలో విడుదలకు సిద్ధమైంది.
  • సిద్ధాంత్‌ చతుర్వేది, మాళవిక మోహనన్‌ కీలక పాత్రల్లో రూపొందిన యాక్షన్‌ ఫిల్మ్‌ ‘యుద్ర’ (Yudhra Movie). రవి ఉద్యావర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబరు 20న హిందీలో విడుదల కానుంది.

ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన సినిమాలు/సిరీస్‌లు

జియో సినిమా

  • దుర్గ (హిందీ) సెప్టెంబరు 16
  • జీ తేరా హై వో మేరా హై (హిందీ) సెప్టెంబరు 20
  • ది పెంగ్విన్‌ (వెబ్‌సిరీస్‌) (సెప్టెంబరు 29)

అమెజాన్‌ ప్రైమ్‌

  • ఎ వెరీ రాయల్ స్కాండిల్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 19

నెట్‌ఫ్లిక్స్‌

  • గ్రేవ్‌ టార్చర్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 16
  • కలినరీ క్లాస్‌ వార్స్‌ (కొరియన్‌) సెప్టెంబరు 17
  • లివ్‌ ఫ్రమ్‌ ది అదర్ సైడ్‌ (ఇంగ్లీష్‌ టాక్‌ షో) సెప్టెంబరు 18
  • ఫాస్ట్‌ ఎక్స్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 18
  • మాన్‌స్టర్స్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 19
  • ట్విలైట్‌ ఆఫ్‌ ది గాడ్స్‌ (వెబ్‌సిరిస్‌) సెప్టెంబరు 19
  • హిజ్‌ త్రీ డాటర్స్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 20
  • ఈవిల్‌ డెడ్ రైజ్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 21
  • ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో2 (టాక్‌ షో) సెప్టెంబరు 21

డిస్నీ+హాట్‌స్టార్‌

  • అన్‌ ప్రిజన్డ్‌ (వెబ్‌సిరీస్‌)  సెప్టెంబరు 16
  • అగాథ ఆల్‌ ఎలాంగ్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 17
  • ది మిస్టరీ ఆఫ్‌ మోక్ష ఐల్యాండ్‌ (తెలుగు) సెప్టెంబరు 20
  • ది జడ్జ్‌ ఫ్రమ్‌ హెల్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 21

Share post:

లేటెస్ట్