నవంబరులో IPLమెగా వేలం.. ఈ ఆరుగురికి నో రిటెన్షన్!

ManaEnadu:ఐపీఎల్ 2025 (IPL 2025) మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. నవంబరు రెండో వారంలో ఈ మెగా వేలం జరిగే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాల టాక్. అయితే ఈ వేలానికి ముందు ఈసారి ఐపీఎల్ టీమ్స్ లో పెను మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయిదుగురిని రిటైన్‌ చేసుకొనేలా ఇప్పటికే పలు ఫ్రాంఛైజీలు జాబితాలను సిద్ధం చేసినట్లు సమాచారం. చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగా రోహిత్ శర్మను ముంబయి ఫ్రాంచైజీ వదిలేస్తుందని క్రీడా వర్గాల్లో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇక ఇతర టీమ్స్ లోనూ స్టార్ ప్లేయర్స్ ను ఆయా ఫ్రాంచైజీలు వదిలేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఆరుగురిని పలు జట్లు వదులుకోనున్నట్లు సమాచారం. ఆ ఆరుగురు ఎవరంటే..

రోహిత్ శర్మ: ముంబయిని ఐదుసార్లు ఐపీఎల్ విన్నర్ గా నిలబెట్టిన రోహిత్ శర్మ (Rohit Sharma)ను గత సీజన్ లో కెప్టెన్ గా తొలగించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రోహిత్ వేరే టీమ్ కు వెళ్తాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ముంబయి ఫ్రాంచైజీనే రోహిత్‌ను విడుదల చేయాలనుకుంటోందట.

కేఎల్ రాహుల్‌: గత ఐపీఎల్‌లో ఓ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత లక్నో టీమ్ ఓనర్ సంజీవ్ గోయంకా కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో (KL Rahul)తో ప్రవర్తించిన వీడియో పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై రాహుల్ ఫ్యాన్స్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈసారి రాహుల్ ఈ జట్టు నుంచి తప్పుకోనున్నట్లు వార్తలొచ్చాయి. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాహుల్ కూడా తన సొంత జట్టు ఆర్సీబీకి వెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలో రాహుల్‌ను లక్నో టీమ్ వదిలేస్తుందని ప్రచారం సాగుతోంది.

ఫాఫ్‌ డుప్లెసిస్‌: రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్ గా ఉన్న ఫాఫ్‌ డుప్లెసిస్‌ (FaF Duplessis) బ్యాటర్‌గా రాణించకపోడమే గాక.. తన జట్టు కూడా కప్‌ సాధించే దిశగా సాగలేదు. ప్రస్తుతం 40 ఏళ్ల వయసుతో ఉన్న డుప్లెసిస్‌ను తప్పించి మరొక యువ క్రికెటర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో ఆర్సీబీ ఉన్నట్లు టాక్.

వెంకటేశ్ అయ్యర్‌: ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజేతగా నిలవడంలోకీలక పాత్ర పోషింతిన వెంకటేశ్ అయ్యర్‌ (Venkatesh Iyer)ను ఈ టీమ్ ఈసారి రీటైన్ చేసుకునే ఆలోచనలో లేనట్లు తెలిసింది. టీమ్ లో ఈసారి ఐదుగురిని (కెప్టెన్ శ్రేయస్‌, సునీల్ నరైన్, ఆండ్రి రస్సెల్, రింకు సింగ్‌తోపాటు ఫిల్‌ సాల్ట్‌ లేదా మిచెల్‌ స్టార్క్‌) మాత్రమే రిటైన్‌ చేసుకొనే అవకాశం మాత్రమే ఉంటే వెంకటేశ్‌ను విడుదల చేయడం ఖాయమేనని క్రీడా వర్గాల్లో టాక్ .

గ్లెన్‌ మాక్స్‌వెల్: గత ఐపీఎల్‌లో నిరాశాజనకమైన పర్ఫామెన్స్ ఇచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell) ఐపీఎల్‌ 2024లో ఘోరంగా విఫలమయ్యాడు. మెగా వేలానికి ముందు మాక్సీని ఆర్సీబీ వదులుకొనే అవకాశాలున్నట్లు సమాచారం.

డేవిడ్ వార్నర్: ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డేవిడ్‌ వార్నర్ (David Warner) కేవలం లీగ్‌ల్లో మాత్రమే ఆడతానని ప్రకటించాడు. అయితే దిల్లీ క్యాపిటల్స్‌ మరోసారి అతడిపై నమ్మకం ఉంచి రిటైన్‌ చేసుకొనే అవకాశం లేదని సమాచారం.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *