ఇజ్రాయెల్ పై ‘షాడో యూనిట్‌’ రివేంజ్ ప్లాన్.. హైఅలర్ట్‌లో ఐడీఎఫ్

Mana Enadu : హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా (Hezbollah Chief Murder)ను హతమార్చడంతో ప్రతీకారంతో రగిలిపోతోంది ఆ సంస్థ. ఈ చర్యకు తప్పకుండా ప్రతీకార చర్య ఉంటుందని ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. హెజ్బొల్లా ఎలా ప్రతీకారం తీర్చుకుంటొందనే అంశంపై ఇజ్రాయెల్‌ వ్యూహకర్తలు తీవ్రంగా యోచిస్తున్నారు. గతంలో ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయెలీ (Israeli)లను లక్ష్యంగా చేసుకొన్న Unit 910 బ్లాక్ యూనిట్ లేదా షాడ్ యూనిట్ (Shadow Unit) ను ఆ సంస్థ రంగంలోకి దింపే అవకాశం ఉందని భావిస్తోంది.

ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడికి ప్లానింగ్

హెజ్బొల్లా మిలిటెంట్‌ సంస్థలో ఓ కోవర్ట్‌ విభాగమైన Unit 910 గతంలో అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలో ఇజ్రాయెల్‌ వాసులను లక్ష్యంగా చేసుకొని పలు దాడులకు తెగబడింది. 32 ఏళ్ల క్రితం కూడా నాటి హెజ్‌బొల్లా నాయకుడు అబ్బాస్‌ అల్‌ ముసావిని ఇజ్రాయెల్‌ దళాలు చంపిన సమయంలో ఈ యూనిట్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఇక తాజాగా ఇజ్రాయెల్ (Israel) మరోసారి హెజ్బొల్లా అధినేతను హతమార్చడంతో ఇప్పుడు కూడా ఆ సంస్థ ఈ బ్లాక్ యూనిట్ ను రంగంలోకి దింపే అవకాశం ఉందని ఐడీఎఫ్ భావిస్తోంది. అదే జరిగితే దీటుగా ఎదుర్కొనేందుకు పథకం రచిస్తోంది.

ఏంటీ బ్లాక్ యూనిట్?

హెజ్‌బొల్లా వద్ద ఉన్న అత్యంత రహస్య, ప్రమాదకర యూనిట్లలో ఒకటైన ఈ యూనిట్ (Black Unit) కు తలాల్‌ హమియా అలియాస్‌ అబు జాఫర్‌ నాయకత్వం వహిస్తున్నాడు. లెబనాన్‌ బయట హెజ్‌బొల్లా దాడులను నిర్వహించే ఈ యూనిట్ ఇరాన్‌కు చెందిన ‘Revolutionary Guards Core’తో కలిసి పనిచేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా దీనికి Terror Infrastructure ఉంది. వాటి సాయంతో ఇది వేగంగా దాడుల చేస్తుంది. 1992లో ఈ యూనిట్‌ బ్యూనస్‌ ఎయిర్స్‌లో ఇజ్రాయెల్‌ దౌత్యకార్యాలయంపై, 1994లో అర్జెంటీనాలో యూదు కమ్యూనిటీ సెంటర్‌పై, 2012లో ఇజ్రాయెలీ పర్యటకుల బస్సుపై ఆత్మాహుతి దాడులకు తెగబడింది.

అమెరికా ఎయిర్ పోర్టుపై దాడికి షాడో యూనిట్ ప్లాన్

కొన్నేళ్ల నుంచి దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా (Asia Unit 910)లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న షాడ్ యూనిట్.. ఇటీవల కాలంలో అమెరికాలోని జేకేఎఫ్‌ ఎయిర్‌పోర్టుపై దాడికి ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే చివరి నిమిషంలో అగ్రరాజ్యం ఈ కుట్రను భగ్నం చేసింది. అయితే దాని ఆపరేటీవ్‌ అలీ కౌరానిని అరెస్టు చేయడంతో అమెరికా, ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా కుట్ర బయటపడింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *