Bigg Boss 8: హౌస్ నుంచి ఇవాళ ఇద్దరు ఔట్!

Mana Enadu : అప్పుడే బిగ్ బాస్ సీజన్-8 (Bigg Boss 8) తెలుగులో నాలుగో వారం కూడా ముగిసేందుకు వచ్చింది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారోనని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ వారం నామినేషన్లలో డేంజర్​ జోన్​లో సోనియా (Sonia) ఆకుల ఉంది. ఆమెతో పాటు ఈ వారం నామినేషన్​లో ఆరుగురు హౌజ్​మేట్స్ ఉన్నారు. సోనియా, నైనిక, పృథ్వీ శెట్టి, నబిల్, ప్రేరణ కంబం, నాగ మణికంఠలో ఇవాళ డబుల్ ఎలిమినేషన్ ఉండనుందట.

డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు

ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయ్యేందుకు డేంజర్ జోన్‌కి వచ్చే ఇద్దరి క్యాండెట్స్‌లో ఒకరు మణికంఠ (Manikanta) అని శనివారం ఎపిసోడ్ లో నాగార్జున (Nagarjuna) ముందే ఫిక్స్ చేశారు. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో మణింకఠ ఎలాగూ డేంజర్ జోన్ కాబట్టి.. మిగిలిన ఐదుగురులో నబీల్‌ ను సేవ్ చేశారు.  మిగిలిన వారిలో ఎవరు సేవ్​ అయ్యారు అనే విషయాన్ని నేటి(ఆదివారం) ఎపిసోడ్​లో చెప్పనున్నారు. అన్​ అఫీషియల్​ పోల్స్​లో మొదటి స్థానంలో నబీల్​ ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో వరసగా ప్రేరణ, మణికంఠ, ఆదిత్య, పృథ్వీ, సోనియా ఉన్నారు.

డబుల్ ఎలిమినేషన్

వీరిలో మణికంఠతో పాటు మరో కంటెస్టెంట్​ సోనియా కూడా డేంజర్ జోన్‌ లో ఉందట. వీరిద్దరిలో సోనియాను ఎలిమినేట్​ చేసినట్లు సోషల్​ మీడియాలో న్యూస్​ వైరల్​ అవుతోంది. అయితే మణికంఠను కూడా ఎలిమినేట్​ (Bigg Boss Eviction) చేసి సీక్రెట్​ రూమ్​కి పంపిస్తారని టాక్ వినిపిస్తోంది​.

సీక్రెట్ రూమ్

మణికంఠ హౌజ్​లో ఎక్కువ ఎమోషనల్​ అవుతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజులు సీక్రెట్​ రూమ్​కు పంపిస్తే గత సీజన్లో గౌతమ్​ లా.. ఈ సీజన్​లో కూడా మణికంఠ 2.0 గా మారి వస్తాడని బిగ్​బాస్ భావిస్తున్నట్లు సమాచారం. ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Share post:

లేటెస్ట్