ManaEnadu:హైదరాబాద్ మెట్రో రైలు రెండోదశ డీపీఆర్‌కు ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రోరైలు రెండోదశకు రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారని మెట్రోరైలు ఎండీ ఎన్‌వీఎస్‌ఎస్‌రెడ్డి తెలిపారు.
రూ.32,237 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలు రెండో దశ పనులు చేపట్టనున్నారు. ఈ దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీకీ మెట్రో రైలు అందుబాటులోకి రానుందని ఎన్‌వీఎస్‌ఎస్ రెడ్డి వెల్లడించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. మరోవైపు.. ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఆరాంఘర్-బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రో లైనును ఫైనల్ చేసింది.