దేశవ్యాప్తంగా వర్తించేలా కూల్చివేతలపై త్వరలో గైడ్ లైన్స్ : సుప్రీంకోర్టు

Mana Enadu : నేరస్థుల ఇళ్ల కూల్చివేతలు (Demolitions) ఇటీవల పలు రాష్ట్రాల్లో నిత్యకృత్యమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నివాసాల కూల్చివేతలపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. కట్టడాల కూల్చివేతకు సంబంధించి దేశం మొత్తం వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలిపింది. కట్టడాల కూల్చివేతకు ఓ వ్యక్తి నిందితుడు లేదా దోషి అని కారణం కాకూడదని వ్యాఖ్యానించింది.

“భారత్​ ఒక లౌకిక దేశం. ఏదో ఒక వర్గానికి కాకుండా పౌరులందరికీ, అన్ని సంస్థల కోసం మార్గదర్శకాలు రూపొందిస్తాం. ఫలానా మతానికి అంటూ భిన్నమైన చట్టం ఉండదు. పబ్లిక్ రోడ్లు, ప్రభుత్వ భూములు (Govt Lands), అడవుల్లో ఎలాంటి అనధికార నిర్మాణాలకు మేము రక్షణగా ఉండం. మా ఆదేశాలు ఆక్రమణదారులకు సహాయపడకుండా చూసుకుంటాం.” అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

నేరగాళ్ల ఇళ్లపై ‘ఆపరేషన్​ బుల్డోజర్‌ (Operation Bulldozer)’ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. సెప్టెంబర్​ 17వ తేదీ ఇదే కేసులో వాదనలు విన్న సుప్రీంకోర్టు, అక్టోబర్ 1 వరకు తమ అనుమతి లేకుండా నిందితులకు సంబంధించిన నిర్మాణాలతో సహా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముగు సుప్రీం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువును పొడగించాలని న్యాయవాదులు కోర్టును అభ్యర్థించగా.. ఈ విషయంలో తుది తీర్పు వచ్చే వరకు ఆదేశాలు అమలులో ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది.

సెప్టెంబర్ 17వ తేదీన సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అసోం ప్రభుత్వం (Assam Govt) ఉల్లంఘించిందంటూ ఇటీవల మళ్లీ ఓ  పిటిషన్​ దాఖలైంది. ఈ పిటిషన్​పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ బెంచ్‌ సోమవారం విచారణ చేపట్టి.. మూడు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆదేశిస్తూ.. ప్రస్తుతానికి అక్కడ కూల్చివేతలను ఆపేయాలని, యథాతథ స్థితి కొనసాగించాలని పేర్కొంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *