హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు

Mana Enadu : హర్యానా శాసనసభ ఎన్నికల పోలింగ్‌ (Haryana Assembky Polling) కొనసాగుతోంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ లో ప్రముఖులతో పాటు సామాన్య ఓటర్లు పాల్గొంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా 1031మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో 101 మంది మహిళలున్నారు.

బరిలో ప్రముఖులు

హర్యానా సీఎం సైనీ లాడ్వా నుంచి పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష నేత భూపిందర్‌ సింగ్‌ హుడా – గర్హి సంప్లాకిలోయి స్థానం నుంచి బరిలో దిగారు. ఎల్లెనాబాద్‌ నుంచి INLD అధినేత అభయ్‌సింగ్‌ చౌతాలా, జేజేపీ చీఫ్‌ దుష్యంత్‌ చౌతాలా ఉచనా కలాన్‌లో, మాజీ రెజ్లర్‌, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్‌ ఫొగట్‌ (Vinesh Phogat) జులానాలో పోటీ చేస్తున్నారు.  పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. ఈనెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఓటేసిన ప్రముఖులు 

ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ప్రముఖులు కూడా ఒక్కొక్కరిగా ఓటింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఝజ్జర్ పోలింగ్ కేంద్రంలో ఒలింపిక్ మెడల్ విన్నర్, స్టార్ షూటర్ మను బాకర్ (Manu Bhaker) ఓటు వేశారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఫరీదాబాద్ లో కేంద్ర మంత్రి క్రిషల్ పాల్ గుర్జర్, కర్నాల్ లో మరో మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అంబాలాలో సీఎం నాయబ్ సింగ్ సైనీ, చాక్రిదాద్రిలో మాజీ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫొగాట్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల వివరాలు

  • నియోజకవర్గాలు- 90
  • పోటీలో నిలిచిన అభ్యర్థులు- 1031
  • మహిళా అభ్యర్థులు- 101
  • స్వతంత్ర అభ్యర్థులు- 464
  • ఓటర్ల సంఖ్య-2,03,54,350 (పురుషులు- 1,07,75,957, మహిళలు- 95,77,926, ట్రాన్స్​జెండర్లు-467)
  • పోలింగ్ కేంద్రాల సంఖ్య- 20,632
  • ఈవీఎంల సంఖ్య- 27,866
  • ఫలితాలు అక్టోబర్ -8వ తేదీ
     

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *